ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలోని సీతాపుర్‌లో ప్రియాంక గాంధీని నిర్బంధించిన పీఏసీ అతిథి గృహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తనను ఎందుకు నిర్బంధిచారో సమాధానం చెప్పాలని ప్రియాంక.. ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు.
ఎఫ్ఐఆర్ కూడా లేకుండా మీ ప్రభుత్వం గత 28 గంటలుగా నన్ను ఎందుకు కస్టడీలో ఉంచింది? రైతులపై వాహనాలు ఎక్కించిన వ్యక్తులను మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదు. - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్తోన్న ఓ వీడియోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. ఇది లఖింపుర్ ఘటనకు సంబంధించిన వీడియోగా ప్రియాంక చెబుతున్నారు. మరో వీడియోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని లఖింపుర్‌లో పర్యటించాలని ఇందులో ప్రియాంక కోరారు.
ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం కోసం మీరు (ప్రధాని) ఈరోజు లఖ్‌నవూ వస్తున్నారని తెలిసింది. మీరు ఈ వీడియో చూశారా?. ఈ వీడియో చూడండి. ఎందుకు నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు చెప్పండి? రాజకీయ నాయకులను మాత్రం ఎందుకు నిలువరిస్తున్నారు? దయచేసి లఖింపుర్‌కు రండి. రైతుల బాధలను వినండి.- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
నిన్న అదుపులోకి..
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటన, తన అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏబీపీ న్యూస్‌తో నిన్న ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, యోగి సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
" ఈ హింసాత్మక ఘటనలో నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కానీ నన్ను వెంటనే అరెస్ట్ చేశారు. అఖిలేశ్ యాదవ్ జీ ని గృహ నిర్బంధంలో ఉంచారు. చన్నీ జీ, బఘేల్ జీ.. యూపీ రావాలనుకుంటే వారిని కూడా అడ్డుకున్నారు.
"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
తన కుమారుడు ఆశిష్‌కు ఈ ఘటనకు ఎలాంచి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు.
" ఒక తండ్రి తన కొడుకును రక్షించాలనే అనుకుంటారు. కానీ ఇక్కడ రుజువులు ఉన్నాయి. వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈ ఘటనకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. మా పార్టీ కార్యకర్తలు.. రైతులతో మాట్లాడి.. అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకున్నారు.
"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి