RRC Railway Recruitment 2021: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Railway Jobs 2021: నార్తర్న్ రైల్వే (Northern Railway) పలు డివిజన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 3093 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Continues below advertisement

రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యేవారికి నార్తర్న్ రైల్వే (Northern Railway) గుడ్ న్యూస్ అందించింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3093 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక జాబ్ నోటిఫికేషన్ (NR Apprentice Recruitment 2021) విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. గడువు అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. నార్తర్న్ రైల్వే పరిధిలోని పలు డివిజన్లలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, టర్నర్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తుంది. వీరికి ఏడాది పాటు అప్రెంటీస్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఈ పోస్టుల మెరిట్ లిస్ట్ నవంబర్ 9వ తేదీన వెలువరించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం http://rrcnr.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Continues below advertisement

Also Read: SSC Recruitment 2021: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే..

విద్యార్హత, వయో పరిమితి.. 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అవ్వాల్సి ఉంటుంది. 2021 అక్టోబర్ 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.100 ఫీజు చెల్లించాలి. 

విభాగాల వారీగా ఖాళీలు..

విభాగం  ఖాళీల సంఖ్య
సీ అండ్ డబ్ల్యూ షాప్ ఏఎంవీ, లక్నో 374
లక్నో డివిజన్ 335
లోకోమోటీవ్ వర్క్‌షాప్, లక్నో 333
లోకోమోటీవ్ వర్క్‌షాప్ (ఎలక్ట్రికల్), లక్నో 225
సీ అండ్ డబ్ల్యూ, ఎన్‌డీఎల్ఎస్ 143
జేయూడీడబ్ల్యూ వర్క్‌షాప్ 111
డీఎల్ఐ షెడ్, తుగలకబాద్ 106
డీఎల్ఐ షెడ్, షకుర్‌బస్తీ 61
సీ అండ్ డబ్ల్యూ, డీఎల్ఐ 75
టీఎంసీ లైన్ 73
బ్రిడ్జ్ వర్క్‌షాప్, లక్నో 43
ఎలక్ట్రిక్ లోకో షెడ్ 31
ఈఎంయూ (డీఎల్ఐ డివిజన్) 29
సీ అండ్ డబ్ల్యూ, హెచ్ఎన్‌జెడ్ఎం 18

Also Read: UPSC ESE Notification 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

Also Read: CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement
Sponsored Links by Taboola