నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్ష‌న్ క‌మిష‌న్ (Staff Selection Commission) శుభవార్త అందించింది. సంస్థలోని ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,261  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. గడువు అక్టోబ‌ర్ 25వ తేదీతో ముగియనుంది. ఫీజు చెల్లింపునకు గడువు అక్టోబ‌ర్ 28వ తేదీ రాత్రి 11.30 వ‌ర‌కు ఉంది. బ్యాంక్ ద్వారా చ‌లాన్ రూపంలో దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు అవ‌కాశం ఉన్నట్లు తెలిపింది. అర్హులను ప‌రీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. రాత పరీక్ష తేదీలు వెల్లడించాల్సి ఉంది.


వచ్చే ఏడాది జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వరిలో రాత ప‌రీక్ష జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. మిగతా వారు రూ.100 ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


Also Read: ITBP Recruitment 2021: ఐటీబీపీలో 553 ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. ముఖ్యమైన తేదీలివే..


ఖాళీల వివరాలివే.. 
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, టెక్నీషియన్‌, మెడికల్‌ అటెండెంట్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 


విద్యార్హత, వయోపరిమితి.. 
పోస్టులను బట్టి విద్యార్హత మారుతోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజ‌ర్వేష‌న్‌ల ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 


Also Read: UPSC ESE Notification 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..


పరీక్ష విధానం.. 
ప్రాథ‌మికంగా కంప్యూట‌ర్ ఆధారిత విధానం (Computer Based Exam) ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలుగా ఉంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న పోస్టు విద్యార్హత ఆధారంగా మూడు పరీక్షల వరకు నిర్వహించే అవకాశం ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు ప్రశ్నకు 0.50 మార్కులు కోత విధిస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్, జ‌న‌రల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. 25 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు. 


Also Read: Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ముఖ్యమైన తేదీలివే..


Also Read: CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి