యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (UPSC ESE)- 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ ఈఎస్ఈ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ నిన్నటి (సెప్టెంబర్ 22) నుంచి ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 12వ తేదీతో ముగియనుంది. యూపీఎస్సీ ఈఎస్ఈ పరీక్షను 2022 ఫిబ్రవరి 20న నిర్వహించనున్నారు.
ఆసక్తి గల వారు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.200 ఫీజు చెల్లించాలి. దీనిలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read: Career Guidance: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..
వయోపరిమితి, విద్యార్హత..
దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలి. 2022 జనవరి 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. పేపర్- 1కు 200 మార్కులు, పేపర్- 2కు 300 మార్కులు కేటాయించారు. ఈ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న నిర్వహిస్తారు.
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన కన్వెన్షనల్ టైప్ (conventional type) ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపరుకు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలుగా ఉంది. ఈ రెండింటిలో క్వాలిఫై ఉన్న వారికి పర్సనాలిటీ టెస్ట్ (200 మార్కులు) ఉంటుంది. ఈ మూడింటి ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. యూపీఎస్సీ వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయండి.
2. ఇక్కడ ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే యూపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలు కనబడతాయి.
3. తరువాత 'Engineering Services (Preliminary/Stage I) Examination' అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్- 1, పార్ట్- 2 అనే రెండింటినీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
4. వీటిని ఎంచుకోవడం ద్వారా కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో సూచించిన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి.
5. దరఖాస్తు ఫీజు చెల్లించాక.. ఫోటో ఐడీ కార్డ్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
6. డాక్యుమెంట్ల అప్‌లోడ్ పూర్తయ్యాక.. సబ్మిట్ చేయాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
7. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.