ఈ ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథ్యాన్ని విరాట్‌ కోహ్లీ వదిలేస్తాడు. దీంతో అతడి స్థానంలో జట్టు కెప్టెన్‌ ఎవరైతే బాగుంటుందో చర్చలు కొనసాగుతున్నాయి. మాజీ క్రికెటర్లు తమకు నచ్చిన కొందరి పేర్లను సూచిస్తున్నారు. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం ముగ్గురిని సూచించాడు.


Also Read: కుర్రాళ్ల దూకుడు మంత్రం.. ధోనీ సేనపై ఏంటి కోల్‌కతా తంత్రం!


సుదీర్ఘ కాలం జట్టుకు నాయకత్వం వహించే వారిని తీసుకుకోవడం మంచిదని మంజ్రేకర్‌ సలహా ఇస్తున్నాడు. ఇప్పుడున్న జట్టులోంచే అయితే ఏబీ డివిలియర్స్‌ను ప్రయత్నించొచ్చని సూచించాడు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో అతడిపై ఆధారపడటం మానేస్తే మంచిదని పేర్కొన్నాడు.


Also watch: UAE లో తొలి ఓటమి ఎవరిదో..


'ఇంకెన్నాళ్లు ఏబీ డివిలియర్స్‌నే నాయకుడు, ప్రధాన ఆటగాడిగా చూస్తారు. కనీసం మూడు నాలుగేళ్లు కెప్టెన్‌గా సేవలందించే వాళ్లను పరిగణనలోకి తీసుకోవాలి. కీరన్‌ పొలార్డ్‌ యువకుడేమీ కాదు. కానీ అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే నాయకుడిగా ముద్రవేసిన వాళ్లు కావాలనుకుంటే అతడిని పరిశీలించొచ్చు' అని మంజ్రేకర్‌ అన్నాడు. 'వేలంలో ప్రయత్నించాలనుకుంటే సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకోవచ్చు. డేవిడ్‌ వార్నర్‌ సైతం సిద్ధంగా ఉన్నాడు' అని అతడు అన్నాడు.


Also Read: సన్‌రైజర్స్ ఇంటికే.. ఐదు పరుగులతో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ!


ఏబీ డివిలియర్స్‌ సరైన ఎంపిక కాదని దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ అంటున్నాడు. మంజ్రేకర్‌తో విభేదించాడు. 'ఏబీడీని కెప్టెన్‌గా ఎంచుకోవడం సరికాదని నా అభిప్రాయం. అతడో అద్భుతమైన ఆటగాడు, నాయకుడు అనడంలో సందేహం లేదు. అతనిప్పుడు కెరీర్‌ చరమాంకంలో ఉన్నాడు' అని అతడు వెల్లడించాడు.


Also Read: రద్దయిన టెస్టు మళ్లీ జరిగే అవకాశం.. ఎప్పుడంటే?


పంజాబ్‌ కింగ్స్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ను ప్రయత్నిస్తే బాగుంటుందని స్టెయిన్‌ అభిప్రాయపడ్డాడు. 'కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం సేవలందించే వారు కావాలనుకుంటే ఆర్‌సీబీ  బెంగళూరు, కర్ణాటక పరిధిలోని వారినే ఎంపిక చేస్తే మేలు. అవును నేను చెప్పేదే బెంగళూరు మాజీ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ గురించే! వచ్చే వేలంలో అతడు బెంగళూరుకు వస్తాడని నాకనిపిస్తోంది' అని స్టెయిన్‌ పేర్కొన్నాడు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి