ఆపదలో ఉన్న వారిని.. అవసరంలో ఉన్న వారిని ఆుదకోవడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన కుదిరితే ప్రభుత్వ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా సాయం చేసేందుకు ఏ మాత్రం ఆలోచించరు. ఇలాంటి సాయాలు చేసేందుకు ఆయన తరపున ఓ ప్రత్యేకమైన టీం కూడా పని చేస్తుంది. ఇటీవలే ఉన్నత చదువులు చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న యువతి దుస్థితి గురించి తెలుసుకుని వెంటనే ఉద్యోగం ఇప్పించిన కేటీఆర్ .. ఇవాళ మరో చదువుల తల్లికి సాయం చేశారు. మెడిసిన్‌లో సీటు సాధించిన పేద పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబిబిఎస్ చదువుకి సహకారం అందించారు.
Also Read : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో మెడిసన్ చదవుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. నాలుగో ఏడాది చదువు కొనసాగించాలంటే ఫీజులు కట్టాలి. కానీ కరోనా కారణంగా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. మళ్లీ కిర్గిజీస్తాన్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో తల్లి తో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది.
Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?
అనూష చదువు గురించి మంత్రి కేటీఆర్‌కు తెలిసింది. వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొంత మంది మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్య పై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. తన ప్రతినిధుల్ని పంపించి వివరాలు తెలుసుకున్నారు. వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు.
అనూష మెడిసిన్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్ ఆర్థిక సాయం చెక్‌ను అందించారు. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలని విషెష్ చెప్పారు. అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బిడ్డ చదువుపై ఆశలు వదిలేసుకున్న తమకు కేటీఆర్ అండగా నిలిచినందుకు ఆ కుటుంబం సంతోషపడింది. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
Also Read : ఎరక్కపోయి ఇరుక్కున్న ఎయిరిండియా.. ఫ్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుందో చూడండి