తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్ర‌తిబింబించే బతుకమ్మ సంబురాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో  ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో మగువల ఆటపాటలు మారుమోగిపోతాయి. ఈ పండుగ ప్రారంభం సందర్భంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.






ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు మెగాస్టార్.


తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు.  గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలను వలయాకారంగా పేర్చుకుంటూ  ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు.  బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.


Also Read: ఇయ్యాల్టి నుంచే పూలపండుగ... బతుకమ్మ ఎలా ప్రారంభమైందో, ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో మీకు తెలుసా..
Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి