తెలంగాణాలో పెద్ద పండుగంటే బతుకమ్మే. ఊరువాడా ఏకమై ప్రతి ఏడాది ధూ..ధాం...గా ఈ పండుగను నిర్వహిస్తారు. ప్రవాస తెలంగాణ ప్రజలు కూడా చాలా అట్టహాసంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది బతుకమ్మ పై ప్రత్యేక గీతాలు విడుదలవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈసారి బతుకమ్మ సాంగ్ అదిరిపోయే రేంజ్లో సిద్ధమయింది. 



 


ఈ పాట కోసం ఆస్కార్ విజేత రెహామాన్ రంగంలోకి దిగారు. ఆయన సంగీత దర్శకత్వంలోనే ఈసారి పాటను కంపోజ్ చేశారు.రెహ్మాన్ లాంటి దిగ్గజం బతుకమ్మ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారని తెలియగానే.. ఈ పాటపై ఆసక్తి నెలకొంది. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కి అప్పజెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక పాడింది కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉన్ని క్రిష్ణన్. ఇక పాటను రాసింది తెలంగాణాకు చెందిన మిట్టపల్లి సురేందర్. పాట షూటింగ్ భూదాన్ పోచం పల్లి ఏరియాలో రెండు రోజుల పాటూ సాగింది. నాలుగు నిమిషాల పాటూ అలరించే ఈ సాంగ్ ను  అక్టోబర్ 5న విడుదల చేశారు. 



కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ కోసం ఈ బతుకమ్మ పాటను రూపొందించినట్టు తెలుస్తోంది. ఏఆర్ రెహామాన్, గౌతమ్ మీనన్ వంటి దిగ్గజాలతో బతుకమ్మ సాంగ్ ను చేయాలన్న ఆలోచన, కృషి కల్వకుంట్ల కవితదే. తాజాగా విడుదలైన 'అల్లిపూల వెన్నెల' పాటలో కవిత కూడా కనిపించడం విశేషం. ఈ పాటను కవిత స్వయంగా లాంచ్ చేశారు. ఈ పాట బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉర్రూతలూపడం ఖాయం.










Also Read: కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాశ్‌రాజ్‌.. మంచు విష్ణు ప్యానల్‌పై ఫిర్యాదు 


Also Read: సమంత సీక్రెట్ టాటూ.. ఇప్పటికీ ఉందా..?


Also Read: బికినీలో లేడీ కమెడియన్.. 'విడాకులు ఎప్పుడు..?' అంటూ ట్రోలింగ్..


Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి