ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్  వద్దు.. పేపర్ బ్యాలెట్ మాత్రమే పెట్టాలని ఈసీని కోరాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వద్దు, పేపర్ బ్యాలెట్ చేద్దామని అంతా అంటున్నారు. రేపు మనం గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ బీపీ మాత్ర వేసుకోకుండా.. పూనకం వచ్చి ట్యాంపర్ అయ్యిందని అంటాడు. కాబట్టి.. చెక్ చేసుకోడానికి అది ఉపయోగపడుతుంది. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం అలాగే వస్తుంది. గత ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ వాడారని స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి పేపర్ బ్యాలెట్ ఇస్తారు. ఇప్పుడు మా సభ్యులలో 180 నుంచి 190 వరకు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఏ ప్యానల్ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని సినీ నటుడు, మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ‘మా’ ఎన్నికల మధ్యలోకి తన కుటుంబ సభ్యుల పేర్లను తెస్తున్నారని, మరోసారి అలా మాట్లాడితే మర్యాదగా ఉండదని విష్ణు హెచ్చరించారు.  


ఒళ్లు దగ్గరపెట్టుకుని.. మర్యాద ఇవ్వండి: ‘‘శ్రీకాంత్, హేమా, బెనర్జీ మీరంటే నాకు చాలా ఇష్టం. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఉన్న చాలామంది నాకిష్టం. 10వ తేదీ తర్వాత అంతా ముఖం చూసుకోవాలి. 10 లేదా 11వ తేదీ తర్వాత ప్రకాష్ రాజ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతాడు. మీరంత ఒళ్లు దగ్గరపెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి. 10 తేదీలోపు మీరు నోరు జారితే 11వ తేదీ తర్వాత మనం ముఖాలు చూసుకోలేం. ‘మా’ కుటుంబం అంతా ఒక ఫ్యామిలీ. జీవిత.. నా తండ్రిని అనే హక్కు మీకు లేదు. ప్రకాష్ రాజ్.. మీ భార్య, మీ సిస్టర్ గురించి నేను మాట్లాడానా? నా ఫ్యామిలీ గురించి మాట్లాడేందుకు మీ హక్కు ఏంటీ? నా ఫ్యామిలీ మీకు ఏం చేసింది? శ్రీహరి ఉంటే మీకు తగిన గుణపాఠం చెప్పేవారు. శ్రీహరి.. మిమ్మల్ని తీసుకొస్తే మా నాన్న కాళ్లు పట్టుకున్నారు. నా సినిమాలో డైరెక్టర్‌ను దుర్భషలాడారు. శ్రీకాంత్.. నా గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. మేం మోసం చేస్తామా లేదా అనేది మీకు తెలుసు. నా ఫ్యామిలీని లాగితే ప్రకాష్ రాజు బాగోదు. మీకు దమ్ముంటే నన్ను విమర్శించండి. మీ యాక్టింట్, డ్రామా కెమేరా ముందు పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రకాజ్ రాజ్ గారు అంటున్నా. ఆ తర్వాత గారు ఉండదు’’ అని విష్ణు అన్నారు.  


అందుకే డబ్బులు కట్టాం..: ప్రకాష్ రాజ్ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సుమారు 190 మంది 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ నేను వ్యక్తిగతంగా ఫోన్‌ చేశాను. వారిలో 100 మంది నేరుగా వచ్చి ఓటు వేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, హైదరాబాద్‌లో ఉన్న పరుచూరి బ్రదర్స్‌ కూడా పోస్టల్‌ బ్యాలెట్‌కు వెళ్తామని చెప్పారు. ఈ మేరకు మీరు ఒక లేఖ ఎన్నికల సంఘానికి పంపాలని వారికి సూచించాను. పోస్టల్ బ్యాలెట్  ఎలా చేయాలో వారికి తెలీదన్నారు. దీంతో వారికి ఒక లెటర్‌ ఫార్మాట్‌ పంపించాను. వాటిని ఎవరికి వారే కొరియర్‌ చేశారు. ఆ లెటర్లను వ్యక్తిగతంగా తీసుకురాలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం రూ.500 కట్టాలని ఎన్నికల సంఘం సభ్యులకు ఎస్‌ఎంఎస్‌ పంపింది. దీనిపై పలువురు పెద్దలు నాకు ఫోన్‌ చేసి అడిగారు. దీంతో ఆ రూ.500 నేను కడతా అని వాళ్లకు చెప్పాను. ఈ విషయాన్ని ఎన్నికల సంఘాన్ని అడిగితే అంగీకరించారు. దీంతో న్యాయబద్ధంగానే ఆ డబ్బులు కట్టాం. ఆ తర్వాత ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ డబ్బులు చెల్లించేందుకు సభ్యులకు సమయం ఇస్తామని, మీ డబ్బులు తీసుకెళ్లండని ఫోన్ వచ్చింది. దీంతో మేం ఆ డబ్బులు తీసుకున్నాం. ఇవన్నీ లీగల్‌గానే జరిగాయి. ఇదేమీ తెలియకుండా ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. 


Also Read: కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాశ్‌రాజ్‌.. మంచు విష్ణు ప్యానల్‌పై ఫిర్యాదు 


విష్ణుపై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు.. మీడియా ముందు కన్నీళ్లు: మంచు విష్ణు ప్యానెల్‌ పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రకాష్ రాజ్ మంగళవారం ఉదయం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్‌ బ్యాలెట్‌లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట శ్రీకాంత్‌, జీవిత కూడా వెళ్లారు. వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని మండిపడ్డారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56 మందికి సంబంధించి రూ. 28 వేలు మోహన్ బాబు ఎలా కడతారని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా? ఇలా గెలుస్తారా? మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 


Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి