హుజూరాబాద్‌లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.కోట్లు కుమ్మరించినా లేక ఎన్ని రాజకీయాలు చేసినా అక్కడ గెలిచేది ఈటల రాజేందర్ అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలో చేరకుండా, కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినప్పటికీ తన సంపూర్ణ మద్దతు మాజీ మంత్రి ఈటలకే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. తాను మాత్రం ఆయనకు అనుకూలంగా పని చేస్తున్నానని అన్నారు. బంజారాహిల్స్‌లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
తాను ఏ పార్టీలో చేరాలి అనే అంశంపై కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు కేటీఆర్ బినామీగా ఉన్న మీడియా సంస్థలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కానీ, ఏ పార్టీలో ఉండాలన్న అంశంపై తనకు ఓ స్పష్టత ఉందని అన్నారు. ఎన్నికల ముందు దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనేక సమీకరణాలు జరగనున్నాయని జోస్యం చెప్పారు. అధికారం కోసం జాతీయ పార్టీలు.. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందని వివరించారు.
టీఆర్‌ఎస్ పార్టీ ఏదో ఒక జాతీయ పార్టీతో జతకట్టే అవకాశం ఉందని, ఇది తేలిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేసే పార్టీలోనే తాను చేరతానని ప్రకటించారు. అది బీజేపీనా, లేక కాంగ్రెస్సా అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. గత కొంతకాలం నుంచి తెలంగాణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అవసరమైన సందర్భాలలో కొన్ని ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సైతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి వీడియో రూపంలో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..
టీఆర్ఎస్ నుంచి అందుకే బయటికి..
ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం తెలంగాణ వాదులు ఎవరూ లేరని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఒకరిద్దరు ఉన్నా వారికి ఎలాంటి అధికారం లేదని అధికారమంతా తండ్రీ కొడుకులకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో బందీగా మారిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని అన్నారు.
Also Read: ‘షేమ్ ఆన్ యూ.. కేటీఆర్! గడీలో బతికే ఆయనే అసలైన సోమరి’ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి