తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా? అని ఘాటుగా నిలదీశారు. మంగళవారం షర్మిల నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేటీఆర్ షేమ్ ఆన్ యూ..’’ అంటూ వ్యాఖ్యానించారు.


మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు ఆయన సిగ్గు పడాలని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదని.. గడీలో బతికే కేసీఆర్ అసలైన సోమరిపోతు అని షర్మిల దుయ్యబట్టారు. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు 20 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. 67 శాతం ఖాళీలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. అన్ని విశ్వవిద్యాలయాలను ఖాళీ యూనివర్సిటీలుగా తయారు చేశారని విమర్శించారు. 


Also Read:  రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క.. వారి స్పందన ఏంటంటే..


అంతేకాక, వీసీల ఎంపిక తీరుపై కూడా విమర్శలు చేశారు. ‘‘ఇక్కడి వీసీ ఈ పోస్టు కోసం రూ.2 కోట్లు ఇచ్చాడట.. వాటిని ఎలా సంపాదించుకోవాలా అని చూస్తున్నారు’’ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విశ్వవిద్యాలయం ఉన్న 570 ఎకరాల్లో పదో వంతు టీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేశారని షర్మిల అన్నారు.


Also Read: ప‌ద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వ‌ద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్


సోమవారం లోటస్ పాండ్‌లో ఆదివాసీ ఆత్మీయ సమ్మేళ‌నంలో గిరిజన ప్రతినిధులతో వైఎస్ ష‌ర్మిల సమావేశం నిర్వహించారు. ప‌దేళ్లుగా ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు ఆదివాసీలు, ఫారెస్ట్ ఆఫీస‌ర్ల మ‌ధ్య ఘ‌ర్షణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయని అన్నారు. చాలా మంది ఆదివాసీ, గిరిజ‌నుల మీద అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారని అన్నారు. ఇటీవల ఖ‌మ్మం జిల్లాలో 21 మంది మ‌హిళ‌ల‌పై కేసులు పెట్టారని.. చంటి పిల్లల త‌ల్లుల‌ను కూడా జైలులో వేసి, వెట్టిచాకిరి చేయించారని గుర్తు చేశారు. వాళ్ల భూములు లాక్కోవ‌ద్దని ఏడుస్తున్నారని గుర్తుచేశారు.


2005 అట‌వీ చ‌ట్టం ఎంతో అద్భుత‌మ‌ని కేసీఆర్ గ‌తంలో చెప్పారని షర్మిల గుర్తుచేశారు. ఆ చ‌ట్టాన్ని మాత్రం అమ‌లు చేయ‌డం లేదన్నారు. వైఎస్ఆర్ బ‌తికి ఉంటే పోడు భూముల‌ను ఎప్పుడో ప‌రిష్కరించేవారని పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు లేరు క‌నుక తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇస్తామని చెప్పారు. ఎన్ని ల‌క్షల ఎక‌రాలు ఉంటే అన్ని ల‌క్షల‌కు ప‌ట్టాలు ఇస్తాం అని వివరించారు. వారికి ప‌థ‌కాలు అమ‌లు చేస్తామని పేర్కొన్నారు.


Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..


Also Read: Gold Smuggling: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి