విశాఖపట్నంలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం స్థానికంగా సంచలనంగా మారింది. తొలుత బాలిక అదృశ్యమైంది. కొద్ది గంటలకే శవమై కుటుంబ సభ్యులకు కనిపించింది. వారు పని చేసే అపార్ట్‌మెంట్ కిందే శవమై కనిపించింది. ఈ ఘటన విశాఖపట్నం నగరం పరిధిలోని అగనంపూడి శనివాడలో చోటుచేసుకుంది. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి 9 గంటలకు గుర్తించారు. అనంతరం బాలిక కోసం కుటుంబీకులు, స్థానికులు వెతుకుతుండగా పక్క అపార్ట్‌మెంట్‌ వద్ద బాలిక మృత దేహాన్ని గుర్తించారు. ఈ బాలిక తల్లిదండ్రులు ఆ అపార్ట్‌మెంట్‌లోనే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.


Also Read: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే మర్డర్.. అన్నంలో మత్తు మందు కలిపి ఆపై హత్య... చివరికేలా చిక్కిందంటే..!


విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన భార్యాభర్తలు ఉపాధి కోసం విశాఖపట్నం వచ్చారు. వారు అగనంపూడిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిలో చేరారు. వారికి 13 ఏళ్ల కూతురు ఉంది. ఆమె స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే, బుధవారం రాత్రి కనిపించకుండా పోయిన బాలిక పక్క అపార్ట్‌మెంట్ కింద శవంగా కనిపించింది. అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడినట్లుగా అక్కడి పరిస్థితి ఉంది. ఆ ఘటనా స్థలం అనుమానస్పదంగా ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బాలికను శవంగా చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


Also Read: హైటెక్‌గా భారీ వ్యభిచార దందా.. 75 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు.. నిజాలు తెలిసి అవాక్కైన పోలీసులు


ఆమెను ఎవరో హత్య చేసి పడేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహంతో అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూర్మన్న పాలెనికి చెందిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అక్కడికి సమీపంలో అద్దెకు నివాసం ఉండే బ్యాచిలర్స్‌పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ఆరేళ్ల క్రితం బాలిక కిడ్నాప్.. తాజాగా ఆచూకీ, కేసులో ఎన్ని ట్విస్టులో.. అదే అతణ్ని పట్టించింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి