కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌ను ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే జయరాములు, 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన విజయజ్యోతి వంటి వారి పేర్లను కూడా పరిశీలించిన బీజేపీ నేతలు చివరికి మొదటి నుంచి బీజేపీలోనే ఉన్న పనతల సురేష్ పేరును ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి సురేష్ పోటీ చేశారు. అప్పుడు ఆయన 1079 ఓట్లను తెచ్చుకుని ఆరో స్థానంలో నిలిచారు. అక్కడ నోటాకు 1570 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఉపఎన్నికల్లో బద్వేలు నుంచి పోటీకి ఆసక్తి చూపించారు. దానికి బీజేపీ హైకమాండ్ అంగీకారం తెలిపింది. 


Also Read : "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !


బద్వేలులో ఇప్పటికే కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు.  తెలుగుదేశం, జననసేన పార్టీలు ఉపఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. దీంతో పోటీ త్రిముఖంగా మారనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి  డాక్టర్ సుధతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ రెండు పార్టీలకూ గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువే ఓట్లు వచ్చాయి. కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికను తేలిగ్గా తీసుబోమని.. లక్ష ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటామని చెబుతున్నారు. 


Also Read : జగన్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ ..ఎందాకైనా వెళ్తానన్న రఘురామ..!


అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించింది.  ప్రధాన ప్రతిపక్షాలేవీ పోటీలో లేదనందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఇష్టం లేని వారందరూ తమ పార్టీకి ఓటు వేస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓ పది లేదా ఇరవై వేల ఓట్లు సాధించినా తమ పార్టీ బలం పెరిగిందన్న సంతృప్తి లభిస్తుదని వారు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంచనాతో ఉంది. గెలుపు కోసం కాకపోయినా తమ పార్టీ పుంజుకుందన్న అభిప్రాయం కలగడానికి అయినా మోస్తరు ఓట్లు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. 


Also Read : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?


బద్వేలులో నామినేషన్లు శుక్రవారంతో ముగుస్తాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే ఎంత మంది పోటీలో ఉంటారనేది క్లారిటీ రానుంది. అయితే ఏకగ్రీవం చేయించాలని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర అభ్యర్థులను బరి నుంచి తప్పించడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తుందని భావిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు తప్ప.. బద్వేలులో పెద్దగా ఇతర పార్టీల హడావుడి కనిపించడం లేదు. 


Also Read : నిధులపై కేంద్రం - రాష్ట్రం టగ్ ఆఫ్ వార్ ! పోలవరం కల సాకారం ఎప్పటికి ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి