మహిళలు, యువతులు, బాలికలు ఒంటరిగా కనిపిస్తే చాలు, ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా వారు అర్ధరాత్రి బయటకు వెళితే.. ఏ సమయానికి ఇంటికి తిరిగొస్తారు, కాస్త ఆలస్యమైతే అసలు తిరిగి చేరుకుంటారా లేదా అని తల్లిదండ్రులలో ఆందోళన మొదలవుతోంది. చిన్నారులతో పాటు వృద్ధులను సైతం కీచకులు వదలడం లేదు. ఎన్ని చట్టాలు అమలవుతున్నా.. పగలు రాత్రి అనే తేడా లేకుండా లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అయితే తన వద్ద ఉన్న దిశా యాప్ ద్వారా తనను రక్షించుకోగలిగింది. పోలీసులు ఆ ఆకతాయి ఆట కట్టించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
చిత్తూరు జిల్లా మదనపల్లె బస్టాండ్‌లో ఓ విద్యార్ధిని బస్సు కోసం ఎదురుచూస్తోంది. మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న ఆ యువతి కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చింది. బస్సు కోసం గంటపాటు ఎదురుచూసింది. అయినా బస్సు రాకపోవడంతో అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. ఐటీ చదువుతున్న విద్యార్థి పవన్ ఆ యువతికి దగ్గర కావాలని ప్రయత్నించాడు. బస్సు రాకపోవడాన్ని అదనుగా భావించిన యువకుడు యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?
మొదటగా ఆ యువతి ఆకతాయిని వారించింది. అతడికి దూరం జరిగినా ఆకతాయి మాత్రం వేధింపులు కొనసాగించాడు. అతడి వికృత చేష్టలను భరించలేని విద్యార్థినికి ఓ ఐడియా వచ్చింది. కాలేజీలో ఓ మహిళా పోలీస్ ద్వారా ఇటీవల డౌన్ లోడ్ చేసుకున్న దిశా యాప్ గుర్తుకొచ్చింది. వెంటనే తన మొబైల్ బయకు తీసి ఎస్ఓఎస్ ద్వారా ఆకతాయి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని పోలీసులకు సమాచారం అందించింది. దిశా యాప్ నుంచి తమకు ఫిర్యాదు అందగానే కంట్రోల్ రూమ్ సిబ్బంది మదనపల్లె టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: అధికారులు తనిఖీలకొచ్చారని బార్లలోని మందుబాబులు పరార్ ! కానీ అసలు విషయం తెలిసిన తర్వాత...
టౌ టౌన్ పోలీసులు నిమిషాల వ్యవధిలో మదనపల్లె బస్టాండ్‌కు చేరుకున్నారు. యువతిని వేధిస్తున్న ఐటీ విద్యార్థి పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కష్ట కాలంలో భయపడకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొన్న విద్యార్థినిని దిశా పోలీసులు అభినందించారు. సకాలంలో దిశా యాప్ ద్వారా అలర్ట్ చేయడంతో ఆమెను రక్షించగలిగామని పోలీసులు తెలిపారు. బాలికలు, యువతులు, మహిళలు తమ ఫోన్లో దిశా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని.. తద్వారా కొన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడతారని చెప్పారు.
Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..