మందు బాబులంటే అందరికీ అలుసే. అసలైన టాక్స్ పేయర్స్ అయినా ఎవరూ గౌరవించరు. డబ్బులు కట్టి బార్లలో కూర్చుని చుక్కేద్దామన్నా టెన్షనే. ఎవరైనా రైడింగ్‌కు వచ్చారంటే పరుగులు పెట్టాల్సిందే. ఎందుకు పారిపోవాలో వాళ్లకూ తెలియదు. కానీ "పట్టుకుంటారనే " భయం మాత్రం ఉంటుంది. కానీ తమ డబ్బులు పెట్టుకుని ప్రభుత్వమే అమ్ముతున్న మద్యాన్ని.. అధికారికంగా లైసెన్స్ ఇచ్చిన చోటనే తాగుతున్నా ఎందుకు పట్టుకుంటారన్న స్పృహ మాత్రం వారికి ఉండదు. ఎందుకంటే అధికారులు తమ మీద ఏ కేసు పెడతారోనన్న భయం. నెల్లూరు లో శుక్రవారం రాత్రి ఇదే ఘటన జరిగింది. 


Also Read : పెళ్లి చేసుకుంటావా? లేదా? సచివాలయ ఉద్యోగికి వేధింపులు.. నెల్లూరు జిల్లాలో ఘటన..


నెల్లూరులో ప్లాస్టిక్ వాడకాన్ని అధికారులు నిషేధించారు. పేరుకే నిషేధం. ఎక్కడ చూసినా వాడుతూనే ఉంటారు. అది వేరే విషయం. అయితే అధికారులకు ఎందుకో తమ నిషేదం ఎలా అమలవుతుందో చూడాలనుకున్నారు. ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లను పరిశీలించాలని నిర్ణయించుకుని..  శుక్రవారం రాత్రి ఆ మేరకు పరిశీలనకు బయలుదేరారు. ముందుగా ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. హడావుడిగా అక్కడేదో పేకాట జరుగుతున్నట్లుగా సోదాలు చేయడంతో మందుబాబులు హడలెత్తిపోయారు. క్షణాల్లో బార్ ఖాళీ అయిపోయింది. 


Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం


అప్పుడు తీరిగ్గా అధికారులు పరిశీలన జరిపారు. బార్‌లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గ్లాసులు, బాటిల్స్ కనిపించాయి. దీంతో  తాము విధించిన నిషేధాన్ని సదరు బార్ అండ్ రెస్టారెంట్ అసలు పాటించడం లేదని ఆగ్రహించారు. వెంటనే వారికి ఫైన్ విధించేశారు. అలాగే మరికొన్ని ఇతర బార్ అండ్ రెస్టారెంట్లకూ వెళ్లారు. అక్కడ కూడా తమ నిషేధం గురించి తెలియనంతగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లే కనిపించడంతో వారికీ ఫైన్ వేసేశారు. నెల్లూరును క్లీన్ గా ఉంచడం అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత నెల్లూరు కోసం అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాజీపడేది లేదని బార్ ఓనర్లకు స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ప్రజలు సహకరిస్తున్నారని వ్యాపారులు కూడా తమ ధోరణిని మార్చుకోవాలని, లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Also Read : ఈబిడ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. ఆ ముగ్గురు నేతలపై సీఐడీ నజర్.. కేసును తప్పుదోవ పట్టించేందుకేనా?


ఇంత వరకూ బాగున్నా ..అధికారులు తనిఖీకొచ్చారని తెలిసి... చేతిలో మందు గ్లాసులు పట్టుకుని పరుగుతీశారు మందుబాబులు. కొంతమంది తాగింది దిగిపోయిందంటూ బావురుమన్నారు. అసలు బార్ యజమానులు ప్లాస్టిక్ వాడకానికి.. తమకు ఏంటి సంబంధం అని వారు లోలోన బాధపడ్డారు. కానీ ఎక్కడైనా కష్టాలన్నీ వారికే. టాక్స్ పేయర్స్ అనే గౌరవం ప్రభుత్వం కాదు కదా అధికారులు కూడా ఇవ్వరు మరి ! 


Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాడు పని.. చైల్డ్ పోర్న్ వీడియోలతో రహస్య దందా.. పోలీసులు ఇలా కనిపెట్టేశారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి