గతంలో ఎప్పుడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌  ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సినీ ప్రియుల్లోనూ ఉత్కంఠ పెంచాయి. ప్రచారం, ఎత్తులు, పైఎత్తులు అబ్బో సాధారణ ఎన్నికలకు మించి అనిపించాయి. ఎట్టకేలకు హాడావిడికి ఫుల్ స్టాప్ పెడుతూ ఫలితాలు వెల్లడయ్యాయి..ప్రకాశ్ రాజ్ పై ఘన విజయంతో మంచు విష్ణు 'మా' అధ్యక్షడిగా విజయం సాధించారు. అయితే అక్టోబరు 10 మంచు కుటుంబానికి భలే కలిసొచ్చిందే అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో ఇదే తేదీన మంచు మోహన్ బాబు కూడా 'మా' అధ్యక్షుడయ్యారు.  



Also Read: ‘మా’ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం, మంచు విష్ణు ఘన విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్



ఒకప్పుడు మూవీ ఆర్టిస్టులకు ఒక అసోసియేషన్ ఒకటి ఉండేదని  దాని పేరే 'మా' అని కూడా ఎవరికీ తెలీదు. పదేళ్ల క్రితం వరకూ ఇన్ని హంగులు, ఆర్భాటాలు కూడా లేవు.  తమిళనాడు నుంచి తెలుగు నేలపై అడుగుపెట్టిన సినీ రంగం కొన్నాళ్లు పెద్ద మనుషులు లేకుండానే సాగింది. టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క వేదిక కూడా ఉండేది కాదు. తమ మొరను వినే పెద్ద దిక్కు లేదా అంటూ కళాకారులు కుమిలిపోతున్న రోజుల్లో.. నేనున్నా అంటూ పుట్టిందే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) పుట్టింది. జూనియర్ ఆర్టిస్టులను, క్యారెక్టర్ ఆర్టిస్టులను సపోర్ట్ చేయడానికి మొదలైన 'మా' అందులోని సభ్యులు వారి ఇష్టప్రకారం తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎంపిక చేసేవారు. మెల్లగా దానికి ఓటింగ్ విధానం మొదలైంది. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2004 అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మోహన్ బాబు ఆసక్తి చూపించారు. అప్పట్లో మోహన్ బాబుకు పోటీగా ఎవరూ లేరు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే 17 ఏళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు కుమారుడు ఒకే తేదీన 'మా'కు అధ్యక్షులుగా ఎంపికవ్వడం విశేషం.



Also Read: ‘మా’ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా.. ఇక సెలవంటూ..



తొలి అధ్యక్షుడు చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి ‘మా’కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారు. చిరంజీవి తర్వాత మురళీ మోహన్, మోహన్ బాబు, నాగార్జున, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, వీకే నరేష్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. అయితే, మురళీ మోహన్ ‘మా’ అధ్యక్షుడిగా ఆరుసార్లు సేవలందించారు. మొదట్లో ‘మా’ సభ్యత్వ రుసుం రూ.5 వేలు ఉండేది. ఆ తర్వాత రూ.10 వేలుకు.. చివరికి రూ.లక్షకు చేరింది. 2015 ముందు వరకూ అధ్యక్షుల ఎంపిక హూందాగానే సాగింది. అంతా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేవారు. కానీ, 2015 నుంచి మాత్రం ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికారు. సభ్యులు వేర్వేరు ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో గ్రూపు రాజకీయాలు పెరిగాయి.


 
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి