బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి ఏర్పడే అల్పపీడనం విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.


బంగాళాఖాతంలో ఏర్పడే.. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశా తీరం వైపు కదులుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనంతో ఒడిశాలోని పలు జిల్లాలు, ఉత్తరాంధ్రపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల  వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపారు.





 


ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారుల అంచనా.


తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశముంది.





 Also Read: MAA Elections Results: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..


Also Read: Nagababu Resign: ‘మా’ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా.. ఇక సెలవంటూ..