MAA President Manchu Vishnu: మాట్లాడేందుకు ఇంకా సమయం ఉంది మిత్రమా..మంచు విష్ణు ట్వీట్ వైరల్

తన విజయానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసిన 'మా' అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు..11 తర్వాత మాట్లాడతా అన్నారు.

Continues below advertisement


ఉత్కంఠ భరితంగా సాగిన మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించాడు. దీనిపై మంచు కుటుంబ సభ్యులు సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు పొద్దున్నే మంచు విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

Continues below advertisement

తన విజయాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన మంచు విష్ణు “శుభోదయం! నా సినిమా సోదరులు నాకు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు నేను వినయపూర్వకంగా ఉన్నాను. ‘మా’ ఎన్నికలపై ఇంకా ఏదైనా చెప్పే ముందు ఇసి సభ్యులు, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టులలో ఒకదానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాట్లాడతా!” అని అన్నారు. దీంతో విష్ణు ఏం మాట్లాడతారా అనే అసక్తి నెలకొంది. 
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
ప్రకాష్ రాజ్‌పై 107 ఓట్ల భారీ ఆధిక్యంతో విష్ణు గెలుపొందారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8  నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగే ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 925 మంది సభ్యుల్లో కొందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. సాయంత్రం విడుదల చేసిన ఎన్నికల ఫలితాల్లో విష్ణుకు క్లియర్ మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఓడి పోయిన వారికి కేవలం 20 నుంచి 30 ఓట్ల తేడా మాత్రమే ఉండేది. కాని ఈసారి ఆధిక్యం సెంచరీ దాటింది. ఇంత ఘన విజయం సాధించిన విష్ణుకు సెలబ్రెటీలంతా సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. 
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
 

Continues below advertisement
Sponsored Links by Taboola