కుంకుమపువ్వు అంటాం కానీ మనం ఉపయోగించేది పువ్వులను కాదు, పూల మధ్యలో ఉండే కేసరాలను. ఆ కేసరాలనే వాడుకలో కుంకుమపూలుగా పిలుచుకోవడం అలవాటైంది. దాదాపు రెండు లక్షల పూలను సేకరించి, వాటి నుంచి కేసరాలను వేరు చేస్తే, ఓ కిలో తూగుతాయి. అందుకే ఇవి చాలా ఖరీదు. ప్రాచీనకాలం నుంచి కుంకుమ పూలను కేవలం గర్భిణులకే కోసమే వినియోగించేవారు. పాలల్లో ఈ కేసరాలను కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతాడని ఓ నమ్మకం. వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ నమ్మకానికి తగ్గ శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చేశారు. అయినా ఆ నమ్మకం మాత్రం ప్రజల్లో ఇంకా పోలేదు.
ఎన్ని ఉపయోగాలో...
బిడ్డ రంగు విషయం పక్కన పెడితే కుంకుమ పువ్వు తినడం వల్ల ఇతర ప్రయోజనాలు మాత్రం కలుగుతాయి.
1. కుంకులపూలలో శక్తివంతమైన క్రోసిన్, క్రొసెటిన్, సఫ్రానాట్, కెంఫెరోల్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరా కణాలను రక్షించడంలో, ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తాయి.
2. ప్రాథమిక నుంచి మధ్యస్థ స్థాయిలో డిప్రెషన్ ఉన్నప్పుడు కుంకుమపూలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయిదు రకాల అధ్యయనాల్లో ఈ విషయం తెలిసింది.
3. గర్భిణులతో పాటూ చాలా మందిని వేధించే సమస్య తిమ్మిర్లు. వీటికి సహజమై పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది కుంకుమపూలు. రోజూ పాలలో కుంకుపూలు తీసుకునే గర్భిణుల్లో తిమ్మిర్లు తక్కువగా కలుగుతాయి. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.
4. గర్భం ధరించాక నాలుగైదు నెలలు పొట్ట పెద్దగా పెరగదు కానీ ఆరో నెల నుంచి బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది. దీని వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. నడుము నొప్పి పెరుగుతుంది. సరిగా నిద్రపట్టదు. అలాంటి వారికి కుంకుమ పూలు మంచి పరిష్కారం.
5. మానసిక ఆందోళనను తగ్గించడంలో ఇది సహాయపడతాయి. కొందరిలో చిన్న విషయానికి కంగారు, భయం, కడుపులో తిప్పినట్టు ఇలా రకరకాలు ఆందోళన లక్షణాలు బయటపడతాయి. దీన్ని యాంగ్జయిటీ అంటారు. గోరువెచ్చటి పాలలో కుంకుమ పూలు వేసుకుని తాగితే దీన్నుంచి ఉపశమనం పొందచ్చు.
6. గర్భం ధరించినప్పుడు సాధారణం కన్నా అధికంగా ఐరన్ అవసరం పడుతుంది. కుంకుమపూల ద్వారా కావాల్సినంత ఐరన్ అందుతుంది. రక్తహీనత సమస్య తల్లీబిడ్డలను చేరదు.
Also read: ఆడపిల్ల అయితేనేం... ఏం తక్కువ?
Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?
Also read: ధనవంతుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఇలా చేయండి