‘మా’ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతోంది. ఆదివారం జరిగి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఫలితాల్లో మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత ప్రకాష్ రాజ్ మీడియాతో నేరుగా మాట్లాడలేదు. విజయం తర్వాత ఆయన విష్ణు విజయాన్ని స్వాగతిస్తూ.. ‘‘తెలుగు బిడ్డ గెలిచాడు. 650 మంది తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అని సింగిల్ లైన్ కామెంట్‌తో ప్రకాష్ రాజ్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే, ఈ ఫలితాలపై ఆయన చెప్పాల్సింది ఇంకా ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
‘‘ఎప్పుడూ లేనంత చైతన్యంతో 650 మంది సభ్యులు మా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు, శివ బాలాజీ, రఘుబాబు, గెలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. అక్కడ ఉన్న సమస్యలు నాకు, తెలుసు మీకు తెలుసు. ఇద్దరం కలిసి విశ్లేషించాం. వాటిని పరిష్కరించడానికి పెద్ద ప్రణాళికతో వచ్చారు. అవి చేయండి. కానీ, ఈ రోజు నేను తెలుగోడిని కాదని, ప్రాంతీయత, జాతీయవాదం నేపథ్యంతో ఈ ఎన్నిక జరిగింది. బైలాస్ మార్చాలి, తెలుగోడు కానివాడు ఓటేయొచ్చు.. కానీ నిలబడకూడదు అనే నినాదం మొదలుపెట్టారు. మేం వచ్చిన తర్వాత ఆ బైలాస్ మారుస్తానని చెప్పారు. నేను ఏం చేయాను?.. నా తల్లిదండ్రులు తెలుగోళ్లు కాదు. అది వారి తప్పు కాదు, నా తప్పు కాదు. తెలుగోళ్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండాలన్నారు. మెంబర్స్ కూడా ఆమోదించారు. ఒక తెలుగు బిడ్డను.. ఒక మంచి బిడ్డను ఎంచుకున్నారు. కానీ, కళాకారుడిగా నాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. అందుకే ‘మా’ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా’’ అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
‘‘వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే.. అసోసియేషన్ సభ్యుడిగా ఉండకూడదు. మీరు కూడా అదే చెప్పారు. దీన్ని నేను నొప్పితో కాదు, దాన్ని స్వాగతిస్తా. సీనియర్ నటులైన మోహన్ బాబు, చలపతిరావు కొడుకు రవిబాబు, కోటా శ్రీనివాసరావు మాటలను గౌరవిస్తాను. అతిగా ఉంటే అతిథిగానే ఉండాలని మీరు ఓపెన్‌గానే చెప్పారు. మీ మాటను గౌరవిస్తా. అలాగే, ఉంటాను. ఇకపై అతిథిగానే ఉంటాను. వారికి బీజేపీ నుంచి కూడా ట్వీట్లు వచ్చాయి. జాతీయవాదాన్ని బలపరిచినందుకు వారికి అభినందనలు చెబుతున్నారు. ‘మా’ సభ్యుడిగా ఉండి దాదాపు 21 ఏళ్లు అవుతోంది’’ అని అన్నారు.
నాగబాబు మీకు మద్దతు ఇచ్చారు కదా.. అనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ బదులిస్తూ.. ‘‘నాగబాబు ఒక ఓటు వల్లే నేను గెలవలేను కదా. సభ్యులే నిర్ణయం చెప్పారు. వారి తీర్పును గౌరవిస్తున్నా’’ అని అన్నారు. మీకు కూడా ఓట్లు పడ్డాయి కదా.. రాజీనామా సరైన నిర్ణయమేనా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నాకు ఓటేసినవారికి థాంక్స్ చెబుతాను. కానీ, అత్యధిక సభ్యులు నన్ను ఆమోదించలేదు. అందుకే ఈ నిర్ణయం. నేను ‘మా’లో లేకపోయినా వారితో కలిసి పనిచేస్తాను. ఇక్కడ సినిమాలు చేస్తాను’’ అని నాగబాబు తెలిపారు.
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
‘‘ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్‌తో కలిసి ఉండలేను. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. కేవలం సభ్యత్వాన్ని మాత్రమే వదులుతున్నా.. తెలుగు సినిమాలను కాదు. నా సినిమా అవకాశాలు, నిర్మాతలు, దర్శకుల నుంచి నన్ను దూరం చేయలేరు. అసోసియేషన్ నన్ను తెలుగుబిడ్డను కాదన్నారు.. అందుకే తప్పుకుంటున్నా. అందులో ఉండి పనిచేయలేను. కానీ, బయట నుంచి పనిచేస్తాను’’ అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి