తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. నేడు ఉత్సవాల్లో ప్రధానమైన గరుడవాహన సేవ జరుగనుంది. ఇప్పటికే టీటీడీ దీని కోసం ఏర్పాట్లు చేసింది. తిరుమలేశుడికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 


మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు జగన్. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు ప్రయాణంలో  3 గంటలకు బర్డ్‌ ఆసుపత్రికి వెళ్తారు. చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అలిపిరి వెళ్తారు. అక్కడ భక్తుల విరాళాలతో నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గాన్ని ఆధునీకికరించారు. దానిని సీఎం జగన్ లాంఛనంగాప్రారంభిస్తారు.


సాయంత్రం 6 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలేశుడి గరుడవాహన సేవలో పాల్గొంటారు. అనంతరం.. పద్మావతి.. వసతి గృహానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. 


మరుసటి రోజు..  శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్‌ను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమరావతికి పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న కారణంగా తిరుపతిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


నాలుగో రోజు వైభవంగా...


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం సేవలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. క్షీర సాగర మథనం నుంచి ఉద్భవించిన కల్పవృక్షం నీడన ఉన్నవారికి ఆకలి దప్పులు ఉండవు, పూర్వజన్మ స్ఫురణ కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.  బ్రహ్మోత్సవాల నాలుగోరోజు రాత్రి శ్రీదేవి, భూదేవులతో మలయప్పస్వామి స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు.  తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.


Also Read: Dussehra 2021 : ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...


Also Read: Dussehra 2021 : నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..


Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి