EPFO Interest: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త వచ్చేసింది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ జమపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ (EPF Interest Rate) మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది.
దీపావళి పండుగ సమయంలో ప్రతి ఏడాది కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓలు పీఎఫ్ ఖాతాదారులు ఈ నెలాఖరులోగా వడ్డీ నగదు అందుకోనున్నారు. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని ఖాతాల్లో జమ చేయనుందని సమాచారం. జాతీయ మీడియాలోనూ ఈ విషయం వైరల్ అవుతోంది. కరోనా కష్ట కాలంలో ఈపీఎఫ్ ఖాతాలలో ఉద్యోగుల నగదుపై చెల్లించే వడ్డీని తగ్గిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ సమావేశమై వడ్డీ రేటును 8.5 శాతంగా యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కనుక ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్న 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: 35 ఏళ్ల కాల పరిమితితో ఇంటి రుణం... కస్టమర్‌కు లాభమా? నష్టమా?
ఏడేళ్ల కనిష్ట వడ్డీ రేటు..
ఏడేళ్ల కనిష్ట వడ్డీ రేటు 8.5 శాతంగా 2019-20 ఏడాదిలో నిర్ణయించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ 8.65 శాతం, 2017-2018 సమయంలో వడ్డీ రేటు 8.55 శాతం, 2016-17లో 8.65 శాతంగా ఉండేది.
ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానాలు..
ఎస్ఎంఎస్ ద్వారా..
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG అని 7738299899 మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి.
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్..
ఈపీఎఫ్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే యూఏఎన్ నెంబర్, కేవైసీ లింక్ చేసి ఉన్న వారికి మాత్రమే పీఎఫ్ వివరాలు అందుతాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది.