ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు సెక్టార్లో ఆవిష్కరణలకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకు అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్లు మోదీ తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు.
ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో చెప్పేందుకు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాపై తాము తీసుకున్న నిర్ణయమే నిదర్శమని మోదీ అన్నారు. అంతరిక్షం, రక్షణ రంగంలో ప్రవేటు సంస్థలను భాగస్వాములుగా చేయడానికి జాతీయ ప్రయోజనాలే కారణమన్నారు. అంతరిక్ష రంగంలో ఎండ్ టు ఎండ్ సాంకేతికత కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని మోదీ చెప్పారు.
- ప్రధాని నరేంద్ర మోదీ
అంతరిక్షం, ఉపగ్రహ సాంకేతికతలలో అత్యాధునిక సామర్థ్యాలు కలిగి ఉండాలనే లక్ష్యంతో ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక సభ్యుల్లో లార్సన్ అండ్ టర్బో, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, నెల్కో, వన్‌వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్‌మైఇండియా, అనంత్ టెక్నాలజీ ఉన్నాయి. కోర్ మెంబర్లుగా అజిస్టా-బీఎస్టీ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మక్సర్ ఇండియా గోద్రేజ్, హ్యూగ్స్ ఇండియా ఉన్నాయి.
Also Read: Corona Update: మరోసారి 20 వేలకు దిగువనే.. కొత్తగా 18,132 కరోనా కేసులు నమోదు
Also Read: కలెక్టర్ ఇంట్లో దొంగతనం.. లేఖ వదిలి వెళ్లిన దొంగలు, రాసింది చూసి విస్తుపోయిన అధికారి