మధ్యప్రదేశ్‌లో అందర్నీ ఆశ్చర్యపర్చే ఘటన చోటు చేసుకుంది. దొంగలు వదిలిన ఓ లేఖను చూసి అవాక్కవడం కలెక్టర్ వంతయింది. ఇక్కడ బాధితుడు కూడా కలెక్టరే. ఆయన ఇంట్లోనే దొంగలు పడి అందినకాడికి డబ్బులు దోచుకొని పోయారు. వెళ్లేటప్పుడు ఓ లేఖను కూడా వదిలివెళ్లారు. కలెక్టర్ ఇంటికి తిరిగొచ్చి చూడగా.. ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయాడు. పూర్తి వివరాలివీ..
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
మధ్యప్రదేశ్‌లోని ఓ డిప్యూటీ కలెక్టర్‌కి వింత అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు రెండున్నర కిలో మీటర్ల దూరంలోని సివిల్ లైన్స్ అనే ప్రాంతంలో త్రిలోచన్ గౌర్ బంగ్లాలో ఓ డిప్యూటీ కలెక్టర్ నివాసం ఉంటున్నారు. ఈ మధ్యే ఆయన ఓ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇలా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. ఇంటి లోపల ఉన్న రూ.30 వేలు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. వెళ్లిపోతూ వారు వదిలిన లేఖ ఆశ్చర్యాన్ని కలిగించింది.
Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ
ఆ లేఖలో దొంగలు ఏం రాశారంటే.. ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం ఎందుకు వేయడం..? అని రాసి లేఖ ఇంట్లో ఉంచేసి వెళ్లిపోయారు. అందుకు తగ్గట్లుగానే కలెక్టర్ ఇంటికి తాళం వేయకుండానే దొంగలు వెళ్లిపోయారు.
తర్వాత పదిహేను రోజుల తర్వాత కలెక్టర్ ఇంటికి తిరిగొచ్చారు. ఇంట్లో కలెక్టర్ ఆ లేఖను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడం.. రూ.30 వేలు, బంగారు ఆభరణాలు అపహరించినట్లు కలెక్టర్ గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి