మనం రోజూ తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జత చేసుకుని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తోంది. కానీ, కొన్ని కాంబినేషన్లు మాత్రం స్లో పాయిజన్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలుసా? అందుకే ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆలోచనలేకుండా కలిపి తింటే కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకువస్తాయని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు అవేమిటో చూద్దాం. 


Also Read: పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లో ఈ చిట్కాలతో ఆ సమస్య నుంచి బయటపడండి


పాలు, పండ్లు


పాలు, పండ్లు కలిపి తీసుకోవడం వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పాలల్లో ఉన్న కొవ్వు, పండ్లలో ఉండే చక్కెర వల్ల జరిగే చర్యలు అప్పటికప్పుడు సమస్య రాకపోయినా... భవిష్యత్తులో చెవి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. 


చపాతీ, పూరీ


గోధుమ పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పిండితో పూరీలు, చపాతీలు చేసుకుని తినడం వల్ల పిండిలో ఉండే ఫైబర్... నూనెతో కలిసి శరీరానికి ఫైబర్ అందకుండా తొందరగా కరిగి గ్లూకోజ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ వ్యాధితో బాధపడే వారికి గ్లూకోజ్ విలువలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా పూరీలలో ఇది ఇంకా ఎక్కువ వేగంగా జరుగుతుంది. అంతేకాదు షుగర్ రాకుండా క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్స్ ఆగిపోతాయి. క్లోమ గ్రంథి పని తీరు నెమ్మదిస్తుంది. ఈ రెండు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయులు బాగా పెరిగిపోతాయి. అందుకే ఎప్పుడూ ఈ రెండు కలిపి తీసుకోకండి. 


తేనె, నెయ్యి 


తేనె, నెయ్యి రెండు ఆరోగ్యానికి ఎంతో మంచి పదార్థాలు. విడివిడిగా తింటే ఎంతో మంచిది. కానీ, ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఈ రెండింటి మోతాదును సమానంగా ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వీటి వల్ల స్లో పాయిజన్‌గా మారుతుంది. అందుకే చాలా చోట్ల ఈ రెండింటిని కలిపాలంటే రెండు సమాన మోతాదుల్లో వేయరు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ వేస్తారు. 


Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు


ఆకు కూరలు, పాలు


చాలా మందికి కొన్ని కూరల్లో పాలు పోసి వండటం అలవాటు. అయితే పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దీని వల్ల శరీరంలో చెడు రక్తం పెరిగిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులకు దారి తీస్తుంది. ఆకు కూరల్లో పాలు పోసి వండటం మంచిది కాదు. 


పెరుగు, అరటిపండు


చాలా మందికి పెరుగన్నంలో అరటి పండు కలిపి తినడం అలవాటు. ఈ రెండు కలిపి తింటే జీర్ణాశయంలో పులిసిపోయి చర్మ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. అంతేకాదు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి