మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు తన స్వరం, స్టైల్‌ను మార్చారు. మొన్నటివరకు ప్రకాష్ రాజ్ ప్యానల్‌పై మండిపడుతూ హాట్ హాట్‌గా కనిపించిన మంచు.. ఈ రోజు తమ ప్యానల్ హామీల ప్రకటన సందర్భంగా కూల్‌గా కనిపించారు. తన స్టైల్ కూడా మార్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్, నాగబాబు చేసిన ఆరోపణలపై కూడా విష్ణు ఆచీతూచి స్పందించారు. వారికి కూల్‌గా కౌంటర్లు ఇచ్చారు. అయితే, హామీల ప్రకటన సందర్భంగా తాను ఏమైనా ఆరోపణలు చేస్తే.. మ్యానిపేస్టో అంశాలు హైలెట్ కావేమో అని భావించి విష్ణు అలా మాట్లాడి ఉండవచ్చని తెలుస్తోంది.
తన ప్యానల్ హామీలను గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో లోకల్-నాన్ లోకల్ అనేది సమస్య కాదని, నటులకు అవకాశాలు కల్పించడమే తమ ప్రాధాన లక్ష్యమని విష్ణు అన్నారు. నటులు ఏ భాషలోనైనా.. ఎక్కడైనా నటించవచ్చని విష్ణు పేర్కొన్నారు. నటుల విషయానికి వస్తే.. దర్శకులు తమ క్రియేటివిటీకి తగినట్లుగా తమకు నచ్చిన నటులను ఎంపిక చేసుకుంటారని, అందుకు తాము అడ్డు చెప్పమని అన్నారు. కానీ, అవకాశాలు ఇచ్చే ముందు స్థానిక నటులను గుర్తించాలని తెలిపారు. ‘మా’ నిబంధనల్లో లొసుగులను అవకాశంగా తీసుకుని, కొందరు అసోసియేషన్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అధికారికంలోకి వచ్చిన తర్వాత రూల్స్ మారుస్తానని విష్ణు అన్నారు.
Also Read: ‘మా’కు ప్రత్యేక యాప్.. నా డబ్బుతో భవనం కడతా.. మంచు విష్ణు ప్యానల్ ముఖ్య హామీలు ఇవే
మీరు ఓటుకు రూ.10 వేలు చెల్లిస్తున్నారని నాగబాబు ఆరోపించారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘రూ.10 వేలు కాదు, రూ.75 వేలు ఇస్తున్నాను. సరిచేసుకోండి. మాలో ఉన్న సుమారు 912 మందికి రూ.75 వేలు చొప్పున ఇచ్చాను. మా నాన్న, అక్క, తమ్ముడికి కూడా రూ.75 వేలు ఇచ్చి ఓటు వేయాలని అడిగాను. మహేష్ బాబుకు రూ.75 వేలు గూగుల్ పే చేశాను. కానీ, తిరిగి అడగలేదు. ఆయన ఊర్లో లేరనుకుంటా ఇప్పుడు. అధ్యక్షుడిని అయిన తర్వాత ఓటు వేయని వారి నుంచి మళ్లీ తిరిగి ఆ డబ్బు తీసుకుంటా’’ అని విష్ణు.. నాగబాబు ఆరోపణలకు పంచ్ ఇచ్చారు.
Also Read: నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు