పులిపిర‌్లు సహజంగా ఎంతో మందికి వస్తుంటాయి. మెడ, చంకలు, గజ్జలు, కనురెప్పల మీద ఇవి ఏర్పడతాయి. చర్మం కింద మందంగా ఉన్న భాగాల్లో కొల్లాజెన్ ఫైబర్స్ పేరుకుపోవడం వల్ల పులిపిరికాయలు ఏర్పడుతాయి. అయితే ఇవి ప్రమాదకరమైనవి కావు. కానీ, ఇవి ఉన్నప్పుడు దుస్తులు, ఆభరణాలు ధరిస్తే వాటికి అవి తాకి దురద, నొప్పి వస్తుంటాయి.
పులిపిర‌్లు ఎలా వస్తాయన్న దానిపై ఇప్పటికీ నిపుణులు సరైన విషయాలు చెప్పలేకపోతున్నారు. కానీ, అధిక బరువు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు, వంశపారం పర్యంగా కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. వైద్యుల పర్యవేక్షణలో వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇలా చేస్తే చాలా నొప్పి వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా పులిపిర‌్లను తొలగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు
* టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని పులిపిరికాయలను తగ్గించడం కోసం వాడవచ్చు. అయితే ముందుగా పులిపిరికాయలు ఉండే ప్రదేశాన్ని బాగా శుభ్రం చేయాలి. తరువాత ఆయిల్‌ను సున్నితంగా మర్దనా చేయాలి. దానిపై ఒక కాటన్ బ్యాండేజ్‌ను కట్టులా కట్టాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పులిపిర‌్లు వాటంతట అవే రాలిపోతాయి.
* బేకింగ్ పౌడర్: ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి కట్టు కట్టండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
* అరటి పండ్ల తొక్కల్లో యాంటీ ఏజింగ్ సమ్మేళనాలు ఉంటాయి. అరటి పండు తొక్కను తీసుకుని పులిపిరికాయపై వేసి కట్టులా కట్టాలి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి. ఇలా వారం పాటు చేస్తే పులిపిరికాయలు పడిపోతాయి.
* విటమిన్ - E ఆయిల్‌ను రోజూ పులిపిర‌్లపై మర్దనా చేయాలి. దీంతో కొన్ని రోజుల్లో పులిపిరికాయలు రాలిపోతాయి.
* కలబంద: ఇందులో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు.
* వెల్లులి: ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు కొన్ని వెల్లుల్లిని తీసుకుని మిక్సీలో వేసి పేస్టుగా చేసి దాన్ని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు.
Also Read: బత్తాయి రసంతో ఎన్ని ప్రయోజనాలో... జీర్ణాశయం శుభ్రం... షుగల్ లెవల్స్ డౌన్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి