ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు తెలంగాణ ఆర్టీసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వారి సౌలభ్యం కోసం బస్సులను ఏకంగా కాలనీలకే పంపేలా ఏర్పాట్లు చేసినట్లుగా తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం తెలిపారు. ఒకే ఏరియా నుంచి 30 మంది లేక కాలనీ నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఉన్న పక్షంలో దగ్గరిలోని డిపో నుంచి బస్సును బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. బుధవారం (అక్టోబరు 6) నుంచి ఈ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. 


Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత


కస్టమర్ కేర్ నెంబర్లివే..
దసరా పండుగ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, టికెట్‌ ధరలు, సమయ పట్టికల సమాచారం కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరే బస్సుల వివరాల కోసం 99592 26257, జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లే బస్సుల వివరాలకు 99592 26264, రెతిఫైల్‌ బస్‌స్టేషన్‌ 99592 26154, కోఠి బస్‌ స్టేషన్‌ 99592 26160 సమాచార కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.


ఇవి 24 గంటలూ పనిచేస్తాయని వివరించారు. ప్రజలకు ఏ సందేహాలున్నా ఈ నెంబర్లను సంప్రదించవచ్చని వివరించారు. సాధారణ ప్రజలతో పాటు కార్మికులు, హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఓ ప్రకటనలో వివరించారు. దసరాకు హైదరాబాద్‌ నలుమూలల నుంచి బస్సులు బయలుదేరతాయని వివరించారు.


Also Read: వంట గ్యాస్‌పై మళ్లీ వాయింపు.. మరోసారి ఎగబాకిన ధర, ఈసారి ఎంత పెరిగిందంటే..


ఏపీలో దసరాకి 4 వేల ప్రత్యేక బస్సులు.. వీటిలో 50 శాతం అధిక ఛార్జీలు
దసరా పండుగ సందర్భంగా ఏపీలో 4 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు ఉంటాయని.. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయని తేల్చి చెప్పారు. బస్సులు వెళ్లేటప్పుడు రద్దీగా ఉండడం.. వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉండడం వల్ల.. నష్టం రాకుండా ఉండేందుకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ వివరించారు.


Also Read: ఆడపడుచుల చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం..మెగాస్టార్ ట్వీట్ వైరల్


Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి