మనకు అందుబాటులో ఉండే పండ్లలో బత్తాయి ఒకటి. ఈ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి సిట్రస్ జాతికి చెందినవి. అంటే విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్ల జ్యూస్‌ని రోజూ ఒక గ్లాస్ తీసుకుంటే అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
Also Read: మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే... ఈ చిట్కాలు పాటించండి
* బత్తాయి పండ్లలో ఫ్లెవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అందుకే రోజూ ఒక గ్లాస్ బత్తాయి రసం తాగాలి.
* డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి బత్తాయి రసం ఎంతో మేలు చేస్తుంది. బత్తాయి రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌తో తీసుకుంటే షుగల్ లెవల్స్ తగ్గుతాయి.
* బత్తాయి రసం తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. మలబద్దకం తగ్గుతుంది.
* బత్తాయి రసాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: గాడిద పాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయా? ఆరోగ్యానికి మేలు చేస్తాయా?
* బత్తాయి పండ్లలో విటమిన్ C అధికంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.
* బత్తాయిలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకోవచ్చు. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట మాయమవుతుంది.
* గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని తాగమని వైద్యులు సలహాలిస్తుంటారు. ఇందులో ఉండే క్యాల్షియం.. కడుపులో పెరిగే బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Also Read: ఈ విధంగా పుదీన రసం తీసుకుంటే... లివర్ క్లీన్ అవుతుంది... వ్యర్థాలు పోతాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి