అందరి కంటే అందంగా కనిపించాలని ఎన్నో ప్రయోగాలు చేస్తాం. కొన్ని బాగానే పని చేస్తాయి. మరికొన్ని ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో నిరాశ చెందుతాం. గాడిద పాలతో ఊహించని ఫలితాలు మనం సొంతం చేసుకోవచ్చు. శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. 


సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం సొంతం చేసుకోవచ్చు. ఆవు పాలు కంటే కూడా గాడిద పాలు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలతో పాటు అందాన్ని పెంచే గుణం కూడా ఉంది. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం‌గా ఉంటాయి. 


⦿ ఆవు పాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా విటమిన్ C గాడిద పాలల్లో దొరుకుతుంది. రోజూ గాడిద పాలు ముఖానికి రాసుకుంటే ముడతలు పోతాయి. అంతేకాదు ఎలర్జీల నుంచి కూడా ఉపశమనం కూడా పొందుతాం. 


⦿ విటమిన్ E, A, B1, B6, C, E, అమినో ఆమ్లాలు, ఒమిగా 3, 6 గాడిదల పాల్లలో పుష్కలంగా దొరుకుతాయి. చర్మం కోసం తీసుకునే ఏ ట్రీట్మెంట్‌లో‌నైనా ఈ విటమిన్లను వాడతారు. UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు విటమిన్ D ఎంతో అవసరం. గాడిద పాలల్లో ఈ విటమిన్ లభిస్తుంది. 
 
⦿ గాడిద పాలకు ప్రాచీన కాలం నుంచే విపరీతమైన డిమాండ్ ఉంది. ఈజిప్టు‌లో ఒకప్పటి అందాల రాణి క్లియో పాత్రా గాడిద పాలతో‌నే స్నానం చేసేవారటట. ఎందుకంటే ఈ పాలు ముసలితనాన్ని తొందరగా రాకుండా చెయ్యగలవని. ఈ గాడిదల పాలను కాస్మొటిక్ , సోప్స్, ఉత్పత్తులు, ఫేస్ వాష్, షాంపూల తయారీలో వాడుతున్నారు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో గాడిద పాలకు డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. 


Also Read: ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారా? వారి కోసం ఇవిగో పరిష్కార మార్గాలు


⦿ కొంతమంది పిల్లలకు ఆవు, గేదె పాలు తాగితే పడవు. అప్పుడు వారికి విరేచనాలు అవుతాయి. ఇలాంటి పిల్లలకు గాడిద పాలు మంచి ప్రత్యమ్నాయం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం‌లోని కణాలను రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. పొగ, రేడియేషన్ వల్ల మన శరీరం‌లోకి ఫ్రీ రాడికల్ సెల్స్ ప్రవేశించి ఆరోగ్యం‌గా ఉన్న కణాలను పాడు చేస్తాయి. దీంతో మనం ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. అనారోగాల బారిన పడకుండా చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్‌దే కీలక పాత్ర. శరీరం‌లోని కణాలను రక్షిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ గాడిద పాల‌ నుంచి బాగా అందుతాయి. 


Also Read: శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగుతున్నారా? ఎలా తెలుసుకోవాలి? సంకేతాలు ఏమిటి?


Also Read: ఎడమవైపు తిరిగి ఎందుకు పడుకోవాలి? అసలు ఎటు తిరిగి పడుకుంటే మంచిది?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి