'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో సమంత పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన షాహిద్ కపూర్ ఆమెతో కలిసి నటించాలనుకుంటున్నట్లు చెప్పారు. రీసెంట్ గా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన షాహిద్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సీజన్ లో సమంత పెర్ఫార్మన్స్ గురించి ప్రశ్నించారు. 


Also Read: భర్తతో విడాకులు.. స్పందించిన శిల్పాశెట్టి..


దీనిపై రియాక్ట్ అయిన షాహిద్.. షోలో సమంత పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయానని.. ఆమెతో కలిసి నటించాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. 


టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సీజన్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పోషించిన రాజీ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం సమంత చాలా కష్టపడింది. చాలా వరకు యాక్షన్ సీన్స్ లో ఎలాంటి డూప్ లేకుండా నటించింది. ఆమె డెడికేషన్ కు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సమంతకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఆమె ఏ ప్రాజెక్ట్ అంగీకరించలేదు. మరోపక్క షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఇప్పుడు 'జెర్సీ' సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.  






Also Read: క్రేజీ అప్డేట్.. మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ ఫైట్..


Also Read: 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు'


Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..


Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్


Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి