మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం, వ్యాయామం, తగిన నిద్ర పోవడమే కాదు... తగినన్ని మంచి నీళ్లు తాగాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. తగినన్ని నీళ్లు తాగకపోతే మన శరీరం మనకు పలు సూచనలు, సంకేతాలు కూడా ఇస్తుంది. వీటిని గమనిస్తూ నీళ్లు తాగాలి. నీళ్లని తగిన మోతాదులో తాగకపోతే మన శరీరం చూపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?
* తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతాం. దీంతో మూత్రం ముదురు పసుపు లేదా గోధుమ రంగుల్లో వస్తుంది. ఇలా వస్తుందంటే శరీరానికి నీరు అవసరమని. వెంటనే తగినన్నినీటిని తాగాలి.
* శరీరంలో ద్రవాలు సరిగ్గా లేకపోతే నోరు తడి ఆరిపోతుంది. దీంతో నోట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా నోరు దుర్వాసన వస్తుంది. ఇలా జరుగుతుందంటే నీళ్లు తాగాల్సి ఉంటుంది. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందుతాం.
* నీళ్లను తక్కువగా తాగితే శరీరంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుంది. దీంతో శరీర భాగాలు, కణాలకు రక్తం సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. దీంతో తల తిరగడం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా అనిపిస్తే వెంటనే నీటిని తాగండి.
Also Read: ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారా? వారి కోసం ఇవిగో పరిష్కార మార్గాలు
* తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరంలో ద్రవాలు సరిగ్గా ఉండవు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అప్పుడు శరీరం అత్యవసర స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు ఆకలి బాగా అవుతుంది. ఆకలి బాగా అవుతుంది అంటే రెండు కారణాలు. ఒకటి తగ్గినన్ని నీళ్లని తాగకపోవడం. రెండోది షుగర్ ఉండటం. షుగర్ లేకపోతే వారు కచ్ఛితంగా మొదటిదే కారణమని భావించాలి. అంటే... వెంటనే నీళ్లని తాగాలి.
* అతిగా నీరు తాగితే మేలు కంటే కీడే ఎక్కువ. ఎక్కువగా నీరు తాగడం వల్ల మెదడుపై ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలి.
Also Read: సంతాన లోపం సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను రోజూ తాగండి