చాలా మంది పిల్లలు, పెద్దల్లో దంతాలు పుచ్చిపోయే సమస్య ఎక్కువైంది. ఇలా పళ్లు పుచ్చిపోవడానికి కారణం కొన్ని రకాల బ్యాక్టిరియాలు. అవి పన్నును నల్లగా మార్చి లోతుగా రంధ్రాన్ని చేస్తాయి. దీనివల్ల నొప్పితో పాటూ, సరిగా ఆహారం నమలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక దంతంతోనే ఆగిపోదు, పక్క దంతాలకు పాకే అవకాశం ఉంది. పరిశుభ్రత లేని కారణంగా ఎక్కువగా ఇలా దంత సమస్యలు రావచ్చంటున్నారు దంత వైద్యులు. దంతక్షయం రాకుండా అడ్డుకోవాలంటే, సమస్య మొదలవ్వక ముందే ఔషధాన్ని వాడడం మొదలుపెట్టేయాలి. ఆ ఔషధమే గ్రీన్ టీ. 


చాలా అధ్యయనాలు గ్రీన్ టీ దంతక్షయం నుంచి కాపాడతుందని తేల్చిచెప్పాయి.  940 మందిపై చేసిన ఒక అధ్యయనంలో రోజూ గ్రీన్ టీ తాగేవారితో పోలిస్తే, తాగనివారిలో దంత క్షయం, నోటి దుర్వాసన అధికంగా ఉన్నట్టు తేలింది. అదే గ్రీన్ టీ రోజూ తాగేవారిలో దంతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు బయటపడింది.  పంటి చిగుళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో గ్రీన్ టీ సహకరిస్తుంది. గ్రీన్ టీలో ‘ఎపిగల్లో కాటెజిన్ గాలెట్’ఇది దంతాన్ని పుచ్చి పోయేలా చేసే బ్యాక్టిరియాతో పోరాడుతుంది. నిజానికి ఆ బ్యాక్టిరియా ఎక్కడ్నించో వచ్చింది కాదు, మనం తిన్న ఆహార పదార్థాలు పళ్ల మధ్యన ఇరక్కుని కుళ్లి బ్యాక్టిరియాగా మారిపోతాయి. అందుకే రోజుకు రెండు సార్లు కచ్చితంగా బ్రష్ చేసుకోమని చెబుతారు దంత వైద్యులు. 


నోటిలో చేరిన బ్యాక్టిరియా గొంతులోకి కూడా జారుకుంటుంది. ఇలా అవ్వడం వల్ల నోటి దుర్వాసన సమస్య పెరుగుతుంది. గ్రీన్ టీ తాగితే, అందులో ఉండే పాలీఫెనాల్స్ గొంతు గుండా జారుతూ, అక్కడున్న బ్యాక్టిరియాను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాయి. రోజూ గ్రీన్ టీ తాగే వాళ్లలో ఈ బ్యాక్టిరియా తుడిచిపెట్టుకుపోతుంది.  కాబట్టి భవిష్యత్తులో దంతసమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పట్నించే గ్రీన్ టీ ని మెనూ లో చేర్చుకోవడం ఉత్తమం. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: బొప్పాయి వల్ల నిజంగానే గర్భం పోతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?


Also read:  చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి


Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి