పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భూపాలపల్లి వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంథని దాటాక ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి వెళుతూ లోయలో పడింది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్‌సాయి పేటకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని గాడుదుల గండి గుట్ట వద్ద మంథని-కాటారం ప్రధాన రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి నుంచి హన్మకొండకు వెళుతున్న పరకాల డిపో బస్ ఏపీ 36 జెడ్ 0161 మంథని వైపునకు వస్తున్న కారు టీఎస్ 04 ఎఫ్ సీ 9774ను ఢీ కొట్టి లోయలో పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ తాటి వినీత్ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ ప్రయాణికుల్లో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది. మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామానికి చెందిన మృతుడు వినీత్ మంథనిలో కార్ కేర్ సెంటర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.


Also Read: మళ్లీ ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అన్నిచోట్లా ఇంతే.. తాజా ధరలు ఇవే..


హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి, మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివసించే ఈశ్వరయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం శంషాబాద్ పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి విధులు పూర్తి చేసుకొని తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈశ్వరయ్య వాహనం కూకట్‌పల్లి ఫోరం మాల్ వంతెనపై ఎదురుగా ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. 


Also Read: బతుకమ్మ చీరల పంపిణీలో నోరుజారిన నేత.. వెళ్లిపోయిన మహిళలు


ఈ ప్రమాదంలో‌ ఈశ్వరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఈశ్వరయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుకి పోలీసులు విచారణ చేపట్టారు.


Also Read: వంట గ్యాస్‌పై మళ్లీ వాయింపు.. మరోసారి ఎగబాకిన ధర, ఈసారి ఎంత పెరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి