సినీ పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’. 1980లో ప్రసారమైన ఈ ధారావాహికతో రావణుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు అరవింద్ త్రివేది. ఆయన ఇక లేరు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలో ఆయన బాధ పడుతున్నారు. దీనితోపాటు మంగళవారం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. అరవింద్ త్రివేది అంత్యక్రియలు ఇవాళ ముంబయిలో జరగనున్నాయి.
రావణుడి పాత్రలోని అరవింద్ త్రివేది అందరికీ బాగా గుర్తుండిపోయారు. అనేక గుజరాతీ సినిమాల్లోనూ ఆయన నటించారు. 40 ఏళ్లపాటు గుజరాతీ చిత్ర పరిశ్రమలో ఆయన కొనసాగారు. రామయణ్ మాత్రమే కాదు.. ఈ విలక్షణ నటుడి విక్రమ్ ఔర్ బేతాళ్ సినిమాలో పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోయింది.
దాదాపు 300లకు పైగా హిందీ, గుజరాతీ చిత్రల్లో అరవింద్ త్రివేది నటించారు. అనేక సామాజిక, పౌరాణిక చిత్రాలలో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు.. 1991 నుండి 1996 వరకు పార్లమెంటు సభ్యుడు కూడా త్రివేది పని చేశారు. సెన్సార్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు విజయ్ ఆనంద్ రాజీనామా చేసిన తరువాత కొంతకాలం తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు.
అరవిం6ద్ త్రివేది ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని రోజుల క్రితం ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఆయన కొవిడ్‌తో మృతి చెందారని వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
రామాయణ్.. దూరదర్శన్‌లో 33 ఏళ్ల కిందట ప్రసారమైంది. ఈ సీరియల్ టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్. విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మళ్లీ ప్రసారం చేశారు. మళ్లీ అదే క్రేజ్ తో జనాలు రామాయణ్ సీరియల్ ను ఆదరించారు. హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ హిందీయేతర రాష్ట్రాల్లోనూ విశేష ప్రజాభిమానం చూరగొంది.
Also Read: MAA Elections: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: Manchu Vishnu: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. నా కుటుంబ సభ్యులను లాగితే మర్యాదగా ఉండదు: విష్ణు వార్నింగ్