తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమయ్యింది. కానీ చీరాల పంపిణీలో అధికార పార్టీ నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నిన్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య చీరలు పంచుతూ కేసీఆర్ అందరికీ భర్త కూడా అయ్యాడంటూ వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భర్తలాంటోడు అనడంపై తీవ్రదుమారం రేగింది. పలుచోట్ల బతుకమ్మ చీరలను తీసుకునేందుకు కొందరు తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. 




Also Read: హుజూరాబాద్‌లో గెలిచేది ఈటలనే.. ఆ పార్టీతో కచ్చితంగా గులాబీ నేతల పొత్తు.. టీఆర్ఎస్ మాజీ ఎంపీ వ్యాఖ్యలు


నోరు జారిన ఎంపీపీ


తాజాగా ఇలాంటి ఘటనే మరో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ఎంపీపీ నోరుజారడంతో చీరలు తీసుకునేందుకు వచ్చిన మహిళలు ఒక్కసారిగా లేచివెళ్లిపోయారు. ఈ షాకింగ్ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చీరలు తీసుకునేందుకు వచ్చిన మహిళలు చీర నాణ్యతపై చర్చించుకోవడంపై ఎంపీపీ మౌనిక నోరుజారి మాట్లాడారు. అయినా ఎంపీపీ వెనక్కి తగ్గకుండా సంబంధిత అధికారిని పిలిచి చీరలన్నింటినీ ప్యాక్‌ చేసేయండని ఆర్డర్స్ ఇచ్చారు. సదరు అధికారి కూడా సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న స్థానిక పెద్దలు కూడా ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మహిళలను వెనక్కి పిలిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీరలు తీసుకునేందుకు మహిళలు ససేమిరా అని అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. 


Also Read: 100 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు... 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ... అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు


నీ చీరలొద్దు పో


ఎంపీపీ మౌనిక మాట్లాడుతూ.. "ఇష్టమైతే తీసుకోండి, లేకుంటే లేదు, తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇంటికెళ్లిపోండి" అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలకు చిన్నబుచ్చుకున్న మహిళలు అధికారులకు షాకిచ్చారు. అక్కడి నుంచి లేచి ఇళ్లకు వెళ్లిపోయారు. వెంటనే పక్కనున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కల్పించుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మహిళలు వారి మాట వినలేదు. కోపమొచ్చిన మహిళలు నీ చీరలొద్దు ఏమొద్దు పో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Also Read: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 3 చెరువుల నీళ్లు తాగానంటూ క్లారిటీ


Also Read: తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక.. బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం... నేతన్నల జీవనస్థితి మారిందన్న మంత్రి కేటీఆర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి