ఎఫ్‌ఐఆర్ లేకుండానే నిర్బంధించారంటూ కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ ఆరోపణలు చేసిన గంటలోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించారంటూ ఆమెతో పాటు మరో పదకొండు మందిపై ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రియాంకా గాంధీ రైతుల్ని కారుతో తొక్కిస్తున్న వీడియోను ట్వీట్ చేసి ప్రధానమంత్రిపై విమర్శలు గుప్పించారు. కారుతో తొక్కించిన వారిని అరెస్ట్ చేయకండా తన వంటి ప్రతిపక్ష నేతలను ఎఫ్ఐఆర్ లేకుండా ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రశ్నించారు.
Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?
రైతులనుకారుతో తొక్కించిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను.. గాయపడిన వారిని పరామర్శించేందుకు సోమవారం సీతాపూర్ వెళ్లిన ప్రియాంకాగాంధీని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతాపూర్‌లోని పీఎసీ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించారు. తీవ్రమైన విమర్శలు రావడంతో 30 గంటల తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లుగా ప్రకటించారు. ఆమెపై సెక్షన్ 144 ఉల్లంఘన.. శాంతి ఉల్లంఘన వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచతి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రియాంకతో పాటు కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర హుడా, యుపి కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, ప్రియాంక గాంధీతో సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : సమస్య ఆర్యన్ ఖానా ? డ్రగ్సా ? ఎప్పటికి తెలుసుకుంటారు ?
ప్రియాంక అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు సీతాపూర్‌లో పీఎసీ గెస్ట్ హౌస్ బయట ఆందోళన చేస్తున్నారు. ప్రియాంక గాంధీని కలవడానికి సీతాపూర్ వెళ్తున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌ను లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అక్కడే నిరసన తెలియచేస్తున్నారు. మరో వైపు రైతులపై జరిగిన దమనకాండపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లఖింపూర్ ఖేరి ఘటనను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. యుపిలో కిల్లింగ్ రాజ్ కొనసాగుతుందని, దేశంలో "నిరంకుశత్వం" కొనసాగుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.
Also Read : అమలులో లేని చట్టాలపై నిరసనలెందుకు? రైతులకు సుప్రీం ప్రశ్న
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా ఆదివారం రైతులు నల్లజెండాలు ప్రదర్శించారు. ఈ సమయంలో, ఒక కారు రైతులపై దూసుకుపోయింది. ఈ కారణంగా, నలుగురు రైతులు మరణించారు. దీని తరువాత, చెలరేగిన హింసలో, రైతులు డ్రైవర్‌తో సహా నలుగురిని కొట్టి చంపారు. ఈ హింసలో ఒక జర్నలిస్ట్ కూడా మరణించాడు. ఈ కేసులో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్ మిశ్రా సహా 14 మందిపై హత్య, నేరపూరిత కుట్ర కేసు నమోదైంది. అయితే ఆ కారులో తాను లేనని కేంద్ర మంత్రి కుమారుడు చెబుతున్నారు.
Also Read : బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి