డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌‌ను అక్టోబర్ 11 వరకు కస్టడీలోనే ఉంచాల్సిందిగా నార్కోటిక్స్ కంట్రోల్ (NCB) బ్యూరో కోర్టును కోరింది. ఈ మేరకు అక్టోబర్ 7వ వరకు ఈ గడువు పొడిగించింది కోర్టు. తాజాగా బెయిల్ కూడా నిరాకరించింది కోర్టు. దీంతో బాలీవుడ్ బాద్ షా  కుటుంబానికి, ఆర్యన్ కి మద్దతుగా నిలుస్తున్నారు ఫ్యాన్స్.  షారుక్‌ మేము మీతో ఉన్నాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ట్విట్టర్‌లో  #WeStandWithSRK ట్రెండింగ్‌లోకి వచ్చింది.






అభిమానులే కాదు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సైతం షారుక్‌ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే  క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీ వ్య‌వ‌హారంలో ఆర్యన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే సల్మాన్.. షారుఖ్ ని కలసి మాట్లాడాడు.  ‘ఆ పిల్లాడిని కాస్త ఊపిరి తీసుకోనివ్వండి’అంటూ సునీల్ శెట్టి అన్నాడు. ఇదే సమయంలో ఆర్యన్ కు సంబంధించి గత వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆర్యన్ ఒక బిచ్చగత్తె పట్ల వ్యవహరించిన తీరు ప్రస్తుతం అభిమానులు వైరల్ చేస్తున్నారు. షారుక్ తనయుడు ఆర్యన్, మలైకా అరోరా, మరికొంత మంది స్నేహితులు ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ బిచ్చగత్తె కుర్రాడిని తీసుకుని ఆర్యన్ కారు వద్దకు వెళ్ళింది. అలా తనని చూసిన ఆర్యన్ తన జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



ఈ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. కాగా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. తాజాగా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోవడంతో కేసు మరింత  భారీగా మారేలా కనిపిస్తోంది.  వీళ్లకు డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. అనే విషయాలపై ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టారు.  మరోవైపు అరెస్ట్ చేసిన సమయం నుంచి ఆర్యన్ ఖాన్ ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. కొడుకు ఆర్యన్‌తో షారుక్ ఖాన్ మాట్లాడి  ధైర్యం చెప్పాడని  అంటున్నారు. మరి ఈ కేసు ఎంత దూరం వెళుతుందో చూడాలి.


Also Read: ఆ మాటలు విని కన్నీళ్లు ఆగలేదు.. ఆయన ఎప్పటికీ నా స్నేహితుడే: మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
Also Read: నామినేషన్ లో తొమ్మిదిమంది.. శ్రీరామ్ తో షణ్ముఖ్,సిరి, జెస్సీల గొడవ..
Also Raed: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి... 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి