మహిళలు, బాలికల, ఆరోగ్యం పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్ఛ అనే కార్యక్రమం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్‌ల పంపిణీ చేయనున్నారు. నేడు (అక్టోబరు 5) సీఎం జగన్ తన క్యాంప్‌ కార్యాలయంలో స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతికి వరకు చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్‌, శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తారు. నెలకు 10 చొప్పున న్యాప్కిన్స్‌‌ను అందిస్తారు.


రుతుక్రమం సమయంలో పాఠశాల, కాలేజి మానేసే వారి సంఖ్యను తగ్గించడంతో పాటు వారి పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు.  అంతేకాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్‌లలో నాణ్యమైన న్యాప్కిన్స్‌ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీ ప్రారంభించనుంది.


TDP Budvel : అభ్యర్థిని ప్రకటించి మరీ వెనక్కి తగ్గిన టీడీపీ ! సంప్రదాయమా ? పలాయనమా ?


జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 4 ( 2015–16) ప్రకారం ఏపీలో 15–24 సంవత్సరాల వయసు గల మహిళలు శానిటరీ న్యాప్కిన్స్‌ వాడుతున్న శాతం 56 మాత్రమే కావడం గమనించదగ్గ విషయం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 5 ( 2019–20) ప్రకారం ఏపీలో 15–24 సంవత్సరాల వయసు గల మహిళలు శానిటరీ న్యాప్కిన్స్‌ వాడుతున్న శాతం 69గా ఉంది. వాటర్‌ సప్లై, శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం భారతదేశంలో 23 శాతం బాలికలు చదువులు మధ్యలో ఆపేయడానికి గల ప్రధాన కారణం శానిటరీ న్యాప్కిన్స్‌ అందుబాటులో లేకపోవడం, స్కూళ్ళు, కాలేజీలలో సరైన వసతులు లేకపోవడం, టాయిలెట్లలో రన్నింగ్‌ వాటర్‌ లేకపోవడం, డిస్పోజల్‌ సౌకర్యాలు లేకపోవడమేనని వెల్లడైంది.


Also Read: అప్పుల బాధతో విషం తాగి తండ్రి ఆత్మహత్య.. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకుని చిన్నారులూ..


అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున (మార్చి 08, 2021) స్వేచ్ఛ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకొచ్చి రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటారు.


ఈ కార్యక్రమం కింద ప్రతి రెండు నెలలకోసారి నేరుగా స్కూల్‌కే వెళ్ళి నెలకు 10 చొప్పున న్యాప్కిన్స్‌‌ను ఒక్కో బాలికకు ప్రభుత్వమే అందించనుంది. రాష్ట్రం మొత్తం 10,388 స్కూళ్ళు, కాలేజీలలో పంపిణీ చేస్తారు. దీంతోపాటు యూనిసెఫ్, వాష్, పీ అండ్‌ జీ వారి సమన్వయంతో ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించడం, ఆరోగ్యం, పరిశుభ్రత ప్రాధాన్యం వివరించే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.


Watch Video : Badvel Bypoll: బద్వేల్ ఉపఎన్నికను బహిష్కరిస్తున్నాం...



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి