శ్రీకాకుళం జిల్లా కొరసవాడలో విషాదం జరిగింది. వెంకటరమణ అనే వ్యక్తి.. కార్పెంటర్ గా పనిచేస్తుండేవాడు. అతడికి చాలా అప్పులు అయ్యాయి. ఈ క్రమంలోనే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తెచ్చుకుని.. ఇంట్లోనే తాగాడు. ఈ ఘటనను వెంకటరమణ ఇద్దరు పిల్లలూ చూశారు. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకున్నారు. వారిద్దరూ తాగేశారు. కొంత సమయం తర్వాత ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంకటరమణను శ్రీకాకులం రిమ్స్ కు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించింది. ఈ కారణంగా అతడు మృతి చెందాడు.
Also Read: East Godavari Crime: గంజాయి రవాణాలో కొత్త దారులు.... బోర్ వెల్ లారీలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత...
వెంకటరమణ తాగిన సీసాను ఇంట్లో పడేశాడు. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకోని.. అతడి కుమారుడు, కుమార్తె ఇద్దరు తాగారు. చిన్నారులకు కూడా అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి మెరుగుపడంది. పిల్లలను వైద్యులు ఇంటింకి పంపారు. పిల్లలైనా బతికి ఉన్నారు. అనుకునే సమయంలోనే.. ఇద్దరికీ వాంతులు కావడం మెుదలైంది. వెంటనే విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కుమారుడు నిహాల్ చనిపోయాడు. కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
ఇప్పుడు వెంకట రమణ కుటుంబ సభ్యుల బాధ.. అంతా ఇంతా కాదు. ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి. ఓ వైపు భర్తను కోల్పోయిన.. ఆ ఇల్లాలికి.. ఇప్పుడు కుమారుడు మృతి చెందడంతో కుంగిపోయింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి బాలుడి మృతదేహానికి కొరసవాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం
Also Read: Hyderabad Accident: నిశ్చితార్థం జరిగింది..త్వరలోనే ఓ ఇంటివారుకానున్నారు...కానీ ఇంతలోనే....