గంజాయి స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమంగా పండించిన గంజాయిని హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. బోర్ వెల్ లారీలో సుమారు 1000 కేజీల గంజాయిని ప్యాక్ చేసి రవాణా చేస్తుండగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ప్రధాన మార్గం ద్వారా వస్తే పట్టుపడతాం అన్న ఆలోచనతో తొండంగి మండలం అద్దరిపేట మీదుగా బీచ్ రోడ్ ద్వారా బోర్ వెల్ లారీలో ఉన్న జనరేటర్ తీసివేసి దాని స్థానంలో గంజాయి ప్యాకింగ్ చేసి అనుమానం రాకుండా అమర్చి రవాణా చేస్తున్నారు. పూర్తి సమాచారంతో శనివారం నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. 




Also Read: సముద్రం మధ్యలో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ పట్టివేత, అదుపులో టాప్ హీరో కొడుకు..!


నలుగురు అరెస్టు


ఈ గంజాయి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయి రవాణాలో పట్టుబడ్డ నేరస్థులపై గతంలో కూడా గంజాయి రవాణా కేసులు ఉన్నాయని, వీరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇమ్మంది వీర వెంకట రమేష్, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి పల్లి పాలెంకు చెందిన అంబటి రాజు, విప్పర్తి సామ్యూల్, గూటం రాజ్ కుమార్ లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకి చెందిన ఇమ్మంది మధు, ఇమ్మంది సత్యనారాయణ మూర్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో వెయ్యి కిలోల గంజాయి, బోర్ వెల్ లారీ, ఒక ద్విచక్ర వాహనంతో పాటు 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.






Also Read: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అఘాయిత్యం... మరో ఘటనలో వృద్ధురాలిపై అత్యాచారం చేసిన మృగాడు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి