చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2,320 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్‌లైన్‌, వెబ్‌ల్యాండ్‌కు ఎక్కించారు. ఈ స్కామ్‌లో ఇప్పటిదాకా ఆరుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు తిరుపతి సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భూముల విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా అన్నారు. యదమరి మండలం గొల్లపల్లి రిటైర్డ్‌ వీఆర్‌వో గణేష్‌ పిళ్లై ఈ అక్రమాలకు ప్రధాన సూత్రదారి అన్నారు. జులై 01, 2009లో ఒకే రోజు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చినట్లు తెలిపారు. 


Also Read: గుప్త నిధుల పేరుతో మోసం.. చివరకు హత్య.. నెల్లూరులో దారుణం..


రెవెన్యూ అధికారుల హస్తం!


చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణాన్ని బయటపెట్టారు సీఐడీ పోలీసులు. నకిలీ పత్రాలు సృష్టించి రూ.500 వేల కోట్లకు పైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నించారు కేటుగాళ్లు. భూములను కాజేయడమే కాదు.. వాటిని కోట్ల రూపాయలకు విక్రయించి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నించారు. 1577 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్ లైన్ లో సొంత పేర్లకు మార్చుకున్నారు. 14 మండలాల్లోని 93 సర్వే నెంబర్లలో ఉన్న 2,320 ఎకరాల స్థలం పేర్లను ఒకేరోజు ఆన్ లైన్ లో మార్చేశారు. నిందితులందరూ ఒకే కుటుంబ సభ్యులుగా సీఐడీ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితులు మోహన్ గణేష్ పిళ్ళె, మధుసూదన్, రాజన్, కోమల, రమణను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు ధరణి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 40 నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ నిందితులకు సహకరించి ఏకంగా ఒక ఎమ్మార్వో సస్పెండ్ కూడా అయ్యారు. ముఠాకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిని గుర్తించే పనిలో ఉన్నామని సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. 


Also Read: పోలీసుల్నే బురిడీ కొట్టించిన దొంగ.. డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్, చొక్కాతో అసలు గుట్టు బయటికి..


ఐదుగురు అరెస్ట్


చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో సర్వే నెంబర్ 459లో 45.42 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. రాజన్, ధరణి, మధుసూధన్‌లు అనే ముగ్గురు వ్యక్తులు ఆన్‌లైన్‌లో 160.09 ఎకరాలు చూపించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలపై సోమల తహసీల్దార్ శ్యాంప్రసాద్ రెడ్డి మే 29, 2020లో పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పెద్ద పంజానీ మండలంలో 2015లో తహసీల్దార్ శ్రీదేవి సహాయంతో నిందితులు అక్రమాలకు పాల్పడ్డినట్లు తెలుస్తోంది. సీసీఎల్‌ఏ నివేదిక ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. 14 మండలాల్లో 93 సర్వే నంబర్స్‌లలో 2,320 ఎకరాలకు తప్పుడు పత్రాలతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ కుంభకోణంలో గణేష్‌ పిళ్లైతో పాటు, అతని కుమారులు మధుసూధన్‌, సుధ, కోమలి, అడవి రమణ మొత్తం ఐదుగురిని అరెస్ట్‌ చేశామని సీఐడీ పోలీసులు ప్రకటించారు. గణేష్‌ పిళ్లై కూతరు ధరణి పరారీలో ఉన్నారు. 


Also Read: అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి