అతనో వ్యాపారి. ప్రముఖులతో ఫోటోలు దిగుతుంటాడు. ఫలానా రాజకీయ నేత తనకు బాగా తెలుసని అమాయకులను నమ్మించాడు. తరచుగా ఏదోక కార్యక్రమంలో పాల్గొంటూ పత్రికల్లోకి ఎక్కుతుంటాడు. తనకు తానే గొప్ప వ్యక్తినని చెప్పుకునే ఈ వ్యక్తి ఓ యూనివర్సిటీలో డాక్టరేట్ కూడా అందుకున్నాడు. అధిక వడ్డీ పేరుతో అమాయకులను మోసం చేశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.50 కోట్ల వరకు వసూలు చేశాడని అంచనా. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

  



Also Read: వరంగల్ రేప్ కేసులో టీఆర్ఎస్ లీడర్ భర్త.. అరెస్టు చేసిన పోలీసులు


జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేశాడు. ఈయన నాలుగు రోజులుగా  పత్తా లేకుండా పోయాడు. పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ జనాలను నమ్మించి మోసం చేశాడు.  ఇతనికి వరంగల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం కొసమెరుపు. 
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రేగొండ నరేష్ తన సేవా కార్యక్రమాలతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇదే అదనుగా భావించి డబ్బు బంగారం వసూలు చేశాడు. అతని బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటం గమనార్హం. వారు దాచిపెట్టుకున్న బంగారాన్ని సైతం అతనికి ఇచ్చారు. 



Also Read: పోలీసుల్నే బురిడీ కొట్టించిన దొంగ.. డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్, చొక్కాతో అసలు గుట్టు బయటికి..


దాదాపు 300 తులాల బంగారంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశాడు. పక్కా ప్రణాళికతోనే తమ డబ్బు, బంగారాన్ని వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రముఖులతో ఫోటోలు దిగడంతో పాటు తరచుగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ పత్రికల్లో వస్తుండటంతో అతడిని నమ్మామని బాధితులు వాపోతున్నారు. నాలుగు రోజులుగా ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయామని గుర్తించారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేశాడనే వివరాలతో లిస్టు రాస్తే అది చాంతాడంత మారిందని పేర్కొన్నారు. చివరికు బాధితులంతా కలిసి జగిత్యాల పోలీస్ సూపరిండెంట్‌కి తమ భాధను విన్నవించుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. 


Also Read: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం


Also Read: గుప్త నిధుల పేరుతో మోసం.. చివరకు హత్య.. నెల్లూరులో దారుణం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి