వరంగల్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత భర్త రేప్ కేసులో ఇరుక్కున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. నిందితుడు తనను ప్రేమిస్తున్నానని వెంటపడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనతో సంబంధం ఏర్పర్చుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా నేత భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లో రేప్ కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్‎ అరెస్ట్ అయ్యారు. శిరీష్‌ తనను ప్రేమిస్తున్నానంటూ వెంట పడి మరీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడని అనంతరం తనను శారీరకంగా వాడుకున్నాడని అండర్‌ రైల్వే గేట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి పోలీసులను గత నెల 23న ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేసినట్లుగా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్‎పై అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. 


Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి


ఫిర్యాదు అందినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. విచారణ జరిపిన పోలీసులు శిరీష్‎ ఆచూకీని గుర్తించి అతణ్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇప్పటికే శిరీష్ తండ్రి, లిక్కర్ వ్యాపారి అయిన ఆకు తోట సుధాకర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. శిరీష్‎ను వరంగల్ జిల్లా పరకాల సబ్ జైలుకు పోలీసులు తరలించారు.


Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ప్రచార వ్యూహాలు షురూ.. మార్నింగ్ వాక్‌లో మంత్రి, గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు


Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?


Also Read: TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. పండగ చేసుకుంటున్న సిబ్బంది?


Also Read: పసిడి ప్రియులకు శుభవార్త...మరింత తగ్గిన బంగారం ధరలు, శుక్రవారం ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలివే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి