దాదాపు ఏడాదిన్నరకు పైగా ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్న ఉద్యోగులు ఇకపై క్రమంగా ఆఫీసులకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో కొవిడ్ కేసులు తగ్గుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం వంటి పరిణామాలతో కరోనాను ఎదుర్కోగలమనే సానుకూల సంకేతాల నేపథ్యంలో కార్పొరేట్ ప్రపంచం ఇక ఆఫీసు నుంచి పనికి శ్రీకారం చుట్టబోతోంది. దీంతో త్వరలోనే చాలా కార్పొరేట్, ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు ఇక ముగింపు పలకనున్నాయి. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు మరో రకమైన వెసులుబాటు కల్పిస్తున్నాయి. 


నెస్లే ఇండియా, టాటా కన్జూమర్స్, ఆమ్వే, డాబర్, గోద్రేజ్ లాంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు రెండు రకాల ఆప్షన్లను అందిస్తున్నాయి. అంటే వారి ఇష్ట ప్రకారం ఇంటి నుంచి పని లేదా ఆఫీసుకు వచ్చి కూడా పని చేసే అవకాశాన్ని ఈ కంపెనీలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కంపెనీలు తమ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన నేపథ్యంలో వర్క్ ఫ్రం ఆఫీసుకే ఎక్కువ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. 


కొద్ది రోజుల క్రితం టీసీఎస్ సంస్థ సీఈవో రాజేశ్ గోపీనాథన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికల్లా తమ ఉద్యోగులు 90 శాతం మందిని ఆఫీసులకు రప్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే, గతంలో ఓ సారి మాత్రం 2025 కల్లా తమ ఉద్యోగుల్లో 25 శాతం మందిని వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చూస్తామని టీసీఎస్ ప్రకటించింది. తాజాగా టీసీఎస్ తరహాలోనే ఇతర ఐటీ సంస్థలైన విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.


అయితే, లింక్డ్ ఇన్ పని విధానంపై ఓ సర్వే చేసింది. దాని ప్రకారం.. ఎక్కువ మంది నిపుణులు హైబ్రీడ్ మోడల్ విధానాన్ని ఇష్టపడుతున్నట్లుగా తేలింది. దీనివల్ల వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ సరిగ్గా బ్యాలెన్స్ చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. లింక్డ్ ఇన్ ‘ఫ్యూచర్ ఆఫ్ వర్క్’ పేరుతో చేసిన ఈ సర్వేలో ప్రతి 10లో 9 మంది హైబ్రీడ్ వర్క్ మోడల్‌కే ఓటు వేసినట్లుగా స్పష్టమైంది.


Also Read: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో విపరీతంగా.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవే..


డెలాయిట్ సర్వేలో ఇలా..
మరోవైపు, డెలాయిట్ చేసిన సర్వే ప్రకారం.. అధిక శాతం మంది భారతీయులు అంటే 84 శాతం మంది తమ ఆఫీసులకు తిరిగి రావడం సురక్షితమని భావిస్తున్నారు. వీరంతా ఖర్చులు, భవిష్యత్తు పట్ల ఒక స్పష్టమైన దృక్పథాన్ని చూపుతున్నారు. ‘డెలాయిట్ గ్లోబల్ స్టేట్ ఆఫ్ ది కన్జ్యూమర్ ట్రాకర్’ తాజా విశ్లేషణ ప్రకారం.. వీరు జాగ్రత్తతో కూడిన భవిత కోరుకుంటున్నట్లుగా అంచనా వేశారు.


Also Read: రోజుకు వెయ్యి కోట్లు ఆర్జిస్తున్న అదానీ.. ఇండియా టాప్‌-10 కుబేరులు వీళ్లే


బ్యాంకింగ్ సంస్థలు కూడా ఇదే బాటలో..


ఐటీ కంపెనీల ధోరణి ఇలా ఉంటే.. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు సైతం ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరుతున్నాయి. వీటిలో కొటక్ మహీంద్రా బ్యాంకు ముందజలో ఉంది. ఈ సంస్థ 9 0శాతం ఉద్యోగుల్ని ఈ ఏడాది చివరినాటికి ఆఫీసులకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొటక్ మహీంద్రా బ్యాంకుతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, డెలాయిట్ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ముగించాలని నిర్ణయించాయి.


Also Read: Amazon Great Indian Festival Sale: మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.38 వేలు తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి