అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ సేల్ జరగనుంది. ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ జరగనుంది. అంటే అక్టోబర్ 2వ తేదీన ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ మొదలవనుంది.
ఈ సేల్‌లో మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందించారు. వన్‌ప్లస్, రెడ్‌మీ, శాంసంగ్, ఐకూ, ఎంఐ, యాపిల్, ఒప్పో, వివో, రియల్‌మీ, టెక్నో బ్రాండ్ల ఫోన్లపై భారీ ఆఫర్లు అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌పై అందించిన డీల్‌ను ఈ సంవత్సరంలోనే అతి పెద్ద ఆఫర్‌గా అమెజాన్ చెప్తోంది. రూ.74,999 విలువైన ఈ ఫోన్‌ను రూ.36,999కే ఈ సేల్‌లో అందించనున్నారు.
రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా, ఈ సేల్‌లో రూ.12,999కే కొనుగోలు చేయవచ్చు. ఎంఐ 11 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. రూ.33,999 విలువైన ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు.
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!
ఇక ఐకూ ఫోన్ల విషయానికి వస్తే.. ఐకూ జెడ్3 5జీ ఫోన్‌పై మంచి ఆఫర్‌ను అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.19,990 కాగా, ఈ సేల్‌లో రూ.17,990కే కొనుగోలు చేయవచ్చు. ఐకూ 7 5జీ ఫోన్‌పై కూడా రూ.2,000 తగ్గింపును అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.31,990 కాగా, ఈ సేల్‌లో రూ.29,990కే కొనుగోలు చేయవచ్చు.
రూ.8,499 విలువైన రెడ్‌మీ 9ఏ ఫోన్ ధరను రూ.6,799గా నిర్ణయించారు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీలపై భారీ ఆఫర్లు అందించారు. వీటితో పాటు టెక్నో స్పార్క్ 7టీ, టెక్నో పోవా 2, టెక్నో స్పార్క్ గో 2021, టెక్నో స్పార్క్ 7, టెక్నో కామోన్ 17 ఫోన్లపై కూడా తగ్గింపు లభించనుంది.
అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ ఆఫర్ల గురించి పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. డీల్స్‌ను వీరు ఒకేసారి కాకుండా రోజుకు కొన్ని విడుదల చేస్తున్నారు.
Also Read: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!
Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!