‘అమరరాజా’ సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు.


Also Read: Amarinder Singh: అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ.. బీజేపీలో చేరతారా.. పంజాబ్ కాంగ్రెస్‌లో కలవరం!


గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు తెలిపారు. తన భూమికోసం రెండు నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.


Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 311 మంది వైరస్ కారణంగా మృతి


అయితే దీనిపై చిత్తూరు నాలుగో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ట్రస్ట్ కు సంబంధించిన వారితో సహా.. గ్రామానికి చెందిన బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్‌/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్‌/డబ్ల్యూ 156(3) సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు కేసులు నమోదయ్యాయి.


Also Read: Punjab Congress crisis: కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగింపులు.. సిద్ధూతో పంజాబ్ సీఎం భేటీ!


రాజన్న ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, చైర్‌పర్సన్‌ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: Posani Krishna Murali: నటుడు పోసాని ఇంటిపై ఇటుక రాళ్లతో దాడులు.. బూతులు తిడుతూ బీభత్సం


Also Read: Pavan Kalyan Alone : "ఇండస్ట్రీ" పవన్‌ను వద్దనుకుందా ? తమ కోసం పోరాడినా ఒంటరిని చేశారా?


Also Read: AP Letter TO GRMB: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ