Amarinder Singh Meets Amit Shah: పంజాబ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనుకుంటున్నట్లుగానే పంజాబ్ మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో అమిత్ షా అధికారిక నివాసానికి అమరీందర్ బుధవారం సాయంత్రం వెళ్లారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు వీరు జరిపిన చర్చలు పంజాబ్ కాంగ్రెస్‌లో గుబులు రేపుతున్నాయి.


కెప్టెన్ అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతారన్న ప్రచారం ఊపందుకున్న తరుణంలో అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో నేతలెవర్నీ కలిసే ఉద్దేశం లేదని మంగళవారం మీడియాతో మాట్లాడిన అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని షా అధికారిక నివాసం క్రిష్ణ మీనన్ మార్గ్‌కు వెళ్లి భేటీ అయ్యారు. అమరీందర్ సింగ్ సన్నిహితుడు రవీన్ తుక్రాల్ వీరి భేటీకి సంబంధించి ఓ ఫొటో పోస్ట్ చేశారు.


Also Read: Punjab New CM: పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ  


అమరీందర్ సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న రైతుల నిరసనపై కేంద్ర మంత్రి షాతో అమరీందర్ సింగ్ చర్చించారు. నూతన వ్యవసాయ సాగు చట్టాలపై త్వరలో నిర్ణయం తీసుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీస మద్దతు ధరలపై రైతులకు హామీ ఇవ్వాలని, పంజాబ్ రైతులకు సాగు విషయంలో మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి అమిత్ షాను అమరీందర్ కోరినట్లు ఆయన సన్నిహితుడు రవీన్ తుక్రాల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.






కాగా, కాంగ్రెస్ పార్టీలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో సీఎం పదవికి అమరీందర్ సింగ్ ఇటీవల రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానం జరగడాన్ని సహించలేక కీలక నిర్ణయం తీసుకున్నానని రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ఆపై చరణ్ జీత్ సింగ్ చన్నీని పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా రాష్ట్ర పార్టీ నేతలు, కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ సోమవారం నాడు పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధూ సైతం పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. 


Also Read: UP Election: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమరంలో ప్రియాంక గాంధీ.. సీఎం అభ్యర్థిగా ఫైనల్!


స్పందించిన కెప్టెన్..


మాజీ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని సైతం వీడతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ అయిన కెప్టెన్ అమరీందర్ తాజాగా ట్వీట్ ద్వారా స్పందించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే షాతో భేటీ అయినట్లు స్పష్టం చేశారు.






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి