రెండు రోజులుగా 20వేలకు పడిపోయిన కొత్త కేసులు.. మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరణాలు కాస్త తగ్గాయి. మెున్న 378 మంది కరోనాతో మరణించగా.. నిన్న ఆ సంఖ్య 311గా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటగా.. ఇప్పటి వరకు 4,48,062 మంది వైరస్ కు బలయ్యారు. కొత్తగా నమోదైన మరణాల్లో సగం కేరళలోనే ఉన్నాయి. నిన్న కేరళలో 12,161 కొత్త కేసులు నమోదు కాగా.. 155 మంది కరోనాతో మరణించారు.





 


 


కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.





 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also Read: South Central Railway: రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి


Also Read: Amarinder Singh: అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ.. బీజేపీలో చేరతారా.. పంజాబ్ కాంగ్రెస్‌లో కలవరం!


Also Read: Afghanistan Crisis: భారత్‌కు తాలిబన్ల లేఖ.. విమాన సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి