గులాబ్ తుపాన్ నుంచి కోలుకుంటున్న వేళ మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమబెంగాల్‌ వైపు కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 


వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో తెలంగాణలో అక్కడక్కడ గురువారం ఓ మోస్తరుగా, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4.4 డిగ్రీలు తగ్గి బుధవారం పగలు గరిష్ఠంగా 27.1 డిగ్రీలుంది.


ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.  రేపు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని.. అక్టోబర్ 2, 3 తేదీల్లో ఢిల్లీలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.   వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లోని పురులియా, బంకురా, పశ్చిమ బర్ధమాన్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో మహారాష్ట్రలోని మరాఠ్వాడా, ముంబై, కొంకణ్‌లోని ఇతర ప్రాంతాల్లో 'అతి భారీ వర్షాలు' కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also Read: Petrol-Diesel Price, 30 September: స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు, ఇక్కడ స్థిరంగా, మీ నగరంలో తాజా ధరలు ఇవే..


Also Read: Horoscope Today:ఈ నాలుగు రాశులవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది, మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం..